ముంగిలి » చర్చ » నిప్పా? కంప్యూటరా?

నిప్పా? కంప్యూటరా?

నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక విచిత్రమైన చర్చ జరుగుతుంది. నేనుకూడా వాదిస్తున్నా. ఎవరితో వాదించానో గుర్తులేదు. చర్చావిషయం ఏంటంటే  “మొత్తం మానవ విఙ్ఞాన ప్రయాణంలో  నిప్పుని ఆవిష్కరించటం గొప్పదా? కంప్యూటర్ ఆవిష్కరించటం గొప్పదా? ”

నేనేం వాదించానో స్పష్టంగా గుర్తు లేదు. బ్లాగుమితృలని అడుగుదాం అనుకున్నా. మీరేమనుకుంటున్నారు?

18 thoughts on “నిప్పా? కంప్యూటరా?

  1. నిప్పు.
    ఎందుకంటే, కంప్యూటర్ అవిస్కరించబడకున్నా ఈ ప్రపంచం చాలా హాయిగా ఉల్లాసంగానే ఉండేది. కానీ నిప్పే కనుక లేకుంటే మనం ఇంకా పచ్చి మాంసం, ఆకులు, అలములు తింటూ జంతువుల్లానే బ్రతుకుతూ ఉండేవాళ్ళం. బహుశామన జాతి అంతరించిపోయేదేమో!!

  2. చిరంజీవికి ఫాలోయింగు ఎక్కువా? ఎన్‌.టి.ఆర్. కి ఎక్కువా అన్నట్టు! అప్పుడు నిప్పు కనిపెట్టకపోతే మానవజాతి ఏమయ్యేదో ఇప్పుడు కంప్యూటర్ లేకపోయినా అంతే అయ్యేది. చిరంజీవి ఫానులు చిరంజీవి అంటారు – నందమూరి ఫానులు నందమూరి అంటారు – నిజానికి వారిద్దరూ లేకపోయినా ప్రపంచం తన దారి తను వెతుక్కునేది.(పిచ్చి అభిమానం చూపడానికి)
    ప్రయాణంలో మజిలీ రాళ్ళు ప్రయాణం కంటా గొప్పవి ఎప్పుడూ కాలేవు. నాకైతే ప్రయాణమే అద్భుతం. మజిలీలు ఇవి కాక మరిన్ని కూడా వస్తాయి. దానిలో వింతా లేదు – విచిత్రమూ లేదు. కాబట్టి రెండూ గొప్పవే – రెండూ గొప్పవి కావు.

  3. కృష్ణమోహన్‌ గారు,
    కంప్యూటరే లేకుంటే తిండి గింజలు పండవా? 🙂
    కంప్యూటర్ని మనం ప్రాథమికావసరం చేసుకున్నాం, అంతే. కంప్యూటరు విఙ్ఞాన రంగంలో, పారిశ్రామిక రంగంలో, పరిశోధనల్లో విపరీతమైన మార్పు (అభివృద్ది అనాలా?) తెచ్చిన మాట వాస్తవమే, కానీ దాని ఖరీదు? ఈ భూమి.

  4. నిప్పు మానవుడి ఆవిష్కరణకు ముందే ఉన్నది, మనం వాడుకుంటున్నాం. కంప్యూటర్‌ను మానవ విజ్ఞాన ప్రయాణంలో భాగంగా, ఒక గొప్పదనంగా పేర్కొనవచ్చు. మొదటిది సృష్టి గొప్పదనం, రెండవది మనిషి విజ్ఞానం గొప్పదనం.

  5. @నవీన్‌ గారు – నేనన్నదీ అదే – కంప్యూటర్ గొప్పది అనలేదు నేను. నిప్పు కనిపెట్టడానికి ముందు మనిషి బతకలేదా? నిప్పు అనేది మనిషి ప్రయాణంలో ఒక మజిలీ. అలాగే కంప్యూటర్ కూడా. నేననేది మజిలీ ఎప్పుడూ ప్రయాణం కంటా గొప్ప కాదు. ఒకటి ఇంకోదానికంటా గొప్పది అనడం మానవ మేధస్సుని కించపరచడమే! అప్పటి మానవ జీవన విధానానికి నిప్పు ఎంత మార్పు తెచ్చిందో – ఇప్పటి జీవనవిధానానికి కంప్యూటర్ కూడా అంతే! రెండిటినీ కనిపెట్టిన మానవ మేధస్సుకి సలామ్‌ చేద్దాం. అంతేకానీ కంప్యూటర్ కీ, నిప్పుకీ కాదు మన సలామ్‌!

    మనం ఎక్కడెక్కడో ఉండి ఈ వాదన ఎలా సాగిస్తున్నామంటారు?

  6. ఆధునిక మానవుడి అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ – నా దృష్టిలో – విద్యుత్తు. దాని ఉత్పత్తి, సరఫరాలపై నియంత్రణ సాధించటం జరగకపోయుంటే నేడీ ప్రపంచం రెండు శతాబ్దాల వెనకుండేది. కాబట్టి నా ఓటు దానికే.

  7. ఏమో నాకేమి చెప్పాలో తెలియట్లేదు.నాకన్నీ అద్భుతాల్లాగే తోస్తున్నాయి. నిప్పు,వక్రం,వ్యవసాయ పరికరాలు,విద్యుత్, ఫోను,టీవీ,కంప్యూటర్ ………..

  8. ముమ్మాటికీ కంప్యూటరే! ఎందుకంటే కంప్యూటర్ నిప్పుని పుట్టించగలదు గాని, నిప్పు కంప్యూటర్ని పుట్టించగలదా? (గూగుల్లో burning Dell laptop అని వెదికిచూడండి మీకు ఋజువు కావాలంటే)

  9. నిప్పు పంచభూతాల్లో ఒకటి. పంచభూతాలు కలిస్తేనే ప్రకృతి. మానవుడు కూడా ప్రకృతిలో భాగమే. మనలో కూడా నిప్పు వుంటుంది. నిప్పు లేక పోతే మనమూ ఉండము, కంప్యూటరూ ఉండదు అసలు ఈ సృష్టే ఉండదు. ఇహ, కంప్యూటరు విషయానికి వస్తే, మానవుడు తన సౌకర్యాలను పెంచుకునే క్రమంలో కనుగొనబడినదే ఈ కంప్యూటరు. కంప్యూటరు తయారు చేయాలన్నా “నిప్పు” కావలసిందే. కాబట్టి పంచభూతాల్లో ఒకటైన నిప్పు కీ, కంప్యూటరు కీ పోలిక పెట్టకండి.

  10. హలో……. సభకు నమస్కారం. ఇక్కడ నిప్పు కి ఓటు వేసిన వాళ్ళందరూ ఇంక బ్లాగు లు చదవడం మానెయ్యాల్సిందిగా…… (వద్దు లెండి, మళ్ళీ అందరి దాడిని నేను ఎదుర్కోలేను 🙂 )

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s