(గమనిక: హాసిని పాత్ర పూర్వాపరాలు తెలుసుకోవాలనుకుంటే హ హా హాసిని చదవండి. చదవకపోయినా ఈ టపాని చదవటానికి ఇబ్బందిలేదు. )
“ఏంటి మురళీ ఏం చేస్తున్నావ్ ? అలా బయటకి పోయివద్దాం రాకూడదూ” అంటూ వచ్చారు శ్రీ శని గారు. అసలే ఆయన నా చిరకాల మితృడు, తరతరాలుగా మా కుటుంబానికి ఆప్తుడు.
“అయ్యా! తమకేంటి ఇంత ప్రొద్దునే నా మీద ఇంత అభిమానం” అన్నాను.
“ఎన్ని సార్లు చెప్పానయ్యా నిద్రలేస్తూనే అద్దంలో ముఖం చూసుకోవద్దని. వింటావా? వినవు. నేను రాక తప్పింది కాదు” అన్నారు శనిగారు.
“ఏంటో ఎన్నిసార్లు మానుకుందామన్నా ఈ వెధవ అలవాటు మారటం లేదు. ప్రొద్దునే లేస్తూనే ముఖం ఎలావుంది, జుత్తి రేగిందా అని చూసుకోవటం అలవాటయ్యింది” అంటూ మనసులో కాదు బయటకే తిట్టుకున్నా. మనసులో అనుకున్నా ఆయనకి ఎలాగు తెలిసిపోతుందిగా.
“ఎంతవరకూ?” అన్నాను.
“భూమి మీద ఇంకా నీ నూకలు చెల్లిపోలేదులే. అదుగో నీకోసం అన్నపూర్ణా వాడు ఆట్టా, మైసూర్ సేండిల్ వాడు సబ్బులు, రోగాలకి రాన్ బ్యాక్సీ వాడు మందులు …. అన్ని ఫ్యాక్టరీల్లో తయారవుతున్నాయి లే. బయపడకు పదా” అన్నారు శనిగారు శూన్యంలోకి చూస్తూ.
”ఆమాత్రం హామీ ఇచ్చారు చాలు. పదండి. గురువుగారు నాకో మంచి స్నేహితురాలుంది తనని మీకు పరిచయం చేస్తా నన్నొదిలి తనతో దోస్తీ చెయ్యకూడదూ ?” అడిగాను ఆశగా.
“మొదట పరిచయం చెయ్యు తర్వాత ఆలోచిస్తాను.” ఆయన నవ్వులో ఏదో చిద్విలాసం. ”హమ్మయ్యా ఇది బాగుంది పదండి” మానవడు ఆశాజీవి.
అలా ఆయన్ని ఒక కాఫీషాపు కి తీసుకొని వెళ్ళా. ఎదురుగా ద గ్రేట్ హాసిని. ఇక ఈ రోజుతో దీని పని కట్టు. శనిగారు దీని తో స్నేహం చేస్తే దీని నోరు పడిపోతుంది. మాట్లాడకుండా ఇది ఎలాగూ బ్రతకలేదు కాబట్టి నరసింహా లో రమ్యకృష్ణలా ఒక చీకటి గదిలోకి పోతుంది.నన్ను ట్రైనులో పెట్టిన హింసకి ఇదే సరైన ప్రతీకారం. ఒక వేళ కర్మకాలి శనిగారి ప్రభావం చూపించలేకపోతే ఈ వాగుడుకాయ ఎలాగూ ఈయన టెంకి పీకి లోపలున్న గుజ్జంతా నంజుకుతినేస్తది. ఆయన జన్మలో ఎవరి జోలికి రాడు, రాలేడు. కాబట్టీ ఏవిధంగా చూసిన నాకే లాభం అనుకుని సంబరపడుతున్నా.
“హాయ్ శనిగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య అసలు కనిపించటం మానేసారు?” అని 32 పళ్ళలో 30 కనబడేలా నవ్వుతూ అడిగింది హాసిని. నాకు కళ్ళు బైర్లుకమ్మి ఆ మెరుపులో మా జేజమ్మవాళ్ళ అమ్మమ్మ కనిపించింది. పాపం బాగా చిక్కిపోయింది 😦
“ఏం లేదు రా కన్నా ఈ మధ్య నువ్వు చేసే పనులన్నీ మెదడుకి మేత పనులేగా. శుభకార్యాలేవీ చేయటం లేదు నాకు మరి పనిపడటం లేదు” ఈయనగారు చెబుతున్నారు ఎక్కడలేని ప్రేమా ఒలకపోస్తూ. (గమనిక: మెదడుకి మేత అనగా మేకలాగ మెదడు మేసేయ్యటం.)
నేను ఏడుపులాంటి నవ్వు తో అక్కడ నిలబడ్డాను. నా ఏడుపు మునుపు డోలు శబ్ధంలా ఉండేది, ఇప్పుడు మద్దెల లా ఉంది ఎందుకో మరి.
ఇంతలో హాసిని ఎవరికో మెదడువాపు తెప్పించాటనికి (తగ్గించటానికి కాదు కేవలం తెప్పించటానికి) పక్కకి వెళ్ళింది. మంచి తరుణం మించిన దొరకదు అని పిచ్చికుక్క తరిమినట్టు పరిగెడుతూ వచ్చి ఇంటి దగ్గర పడ్డాను. నా వెనుకే శనిగారు దారిలో ఉన్న పనులు పూర్తి చేసుకోని వచ్చారు. “ఈవిడ మీకెలా తెలుసు స్వామీ?” అన్నాను.
“అసలు ఆవిడ నీకు పరిచయం కావటమే నా ప్రభావం వలన. నీకో విషయం చెప్పనా” అని ఒక చిన్న పిట్టకధ చెప్పారు. అదే హాసిని పెళ్ళి చూపుల కధ.
హాసిని ఎప్పటిలాగే ఆఫీస్ కి టైముకి వచ్చేసి సిన్సియర్ గా చాటింగు చేసుకుంటూ ఉంది. ఇంతలో తనని పెళ్ళి చూపులు చూసిన 18 వ పెళ్ళికొడుకు ఉదయ్ కిరణ్ పింగ్ చేసాడు. వాడి బాసుగారి కూతురి స్నేహితురాలయిన రమ్య లేచిపోయి పెళ్ళిచేసుకున్న విషయం చర్చించాక, ఆఫీస్ ప్యూన్ సుబ్బారావు పట్టబుర్ర మీద ఈకలు మొలవక పోవటనికి కారణాం గురించి గొడవ పడుతున్నారు. ఇంతలో 19 వ పెళ్ళికొడుకు రాంచరణ్ “నాకిష్టమయిన పాట మౌనమే నా భాష ఓ మూగ మనసా ” అని మెసేజ్ పెట్టాడు. అప్పుడే రాబోయే పెళ్ళికొడుకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు. రింగ్ టోన్ లోనే “మే..మే..” అని మేక అరుపు వినిపించింది. బకరా వాసన కొత్త బకరా వాసన అని హాసిని లోని వాగుడు దెయ్యం ఫోన్ ఎత్తింది. “ఈ పాటికి మీ ఇంట్లో వాళ్ళు నా గురించి చెప్పే ఉంటారు. రేపు శనివారం సెలవు కదా కలుద్దామా?” అని అడిగాడు. ఆ విషయం మీద ఒకగంట మాట్లాడిన తరువాత “సరే రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
శనివారం ఉదయాన్నే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసాడు నేను బయలుదేరాను మీరు రెడీ అవ్వండి అని. ఇక తప్పదని హాసిని 9 గంటలకే లేచి తయారవ్వటం మొదలు పెట్టింది. పవన్ మేఘాల్లో తేలిపోతూ,పాట పాడుకుంటూ వస్తున్నాడు. “హహ హా హహ హా హాసిని నీ నవ్వుల్లో ఎవరునట్టూ…. మేరి సఝనా.. మేరి సఝనా.. ధడేల్ ధడేల్ డమాల్” శనిగారు ఎంట్రీ వలన వచ్చిన శబ్ధం. పవన్ ఆగి ఉన్న ఆటో ని అరవై కిలోమీటర్ల వేగం తో గుద్ది ఎగిరి, అంబులెన్స్ టాపు మీద పడ్డారు. ఆయన బైకు జారుతూ పోయి 108 క్రిందకి దూరింది. హాసిని కాసేపు ఆయన కోసం చూసింది రాలేదు. ఫోన్ చేసింది ఎత్తలేదు. సర్లే అని అన్నపూర్ణా మెస్ కి వెళ్ళి ఆంధ్రా తాలి తెప్పించుకొని దానిలోకి సర్వర్ ని నంజుకొని తినేసింది.
ఇది జరిగిన నెల రోజులకి పవన్ కోలుకుని పట్టు వదలని పప్పూ మరలా పరీక్షలు రాసినట్టుగా పెళ్ళిచూపులకి మరోసారి సిద్దపడ్డాడు. శనివారం కలిసి రాలేదని ఆదివారం ఫోన్ చేసి బయలుదేరాడు. కూకట్ పల్లి నుండి ఎర్రగడ్డ వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. పిడుగులతో కూడిన వర్షం. వరదగా వచ్చిన నీటిలో పవన్ బైకు కొట్టుకుపోయి ఒక మేన్ హోల్ లొ ఇరుక్కుంది. ఈతరాని పవన్ ని భద్రతాదళాలు కాపాడాయన్న వార్తని బావర్చి లో ఇస్మాయిల్ తో మాటాడుతూ బిరియాని తింటూ ఉన్న హాసిని కి టి.వి. చూస్తే గాని తెలియలేదు.(అమ్మతోడు సదరు ఇస్మాయిల్ ఎవరో నాకే కాదు హాసినికి కూడా అప్పటి వరకు తెలియదు)
అయినా పవన్ మరలా ఆదివారం రాగానే నేను రెడీ అని పోన్ చేసాడు. ఈ సారి హాసిని హృదయం చలించింది. పెళ్ళిభోజనాల్లో లో ఎంగిలి ఆకు కోసం ఎదురు చూస్తున్న మున్సిపాలిటి కుక్కలా తనకోసం ఎదురు చూస్తున్న పవన్ మీద మంచి అభిప్రాయం కలిగింది.వినాయకుడికి కొబ్బరికాయలు కొట్టి, జేబులో నిమ్మకాయలు పెట్టుకుని బయలుదేరిన పవన్ ఏ ఆటంకాలు లేకుండా వచ్చేసాడు. మేడమీదనుంచి దిగి పవన్ ని చూసిన హాసిని కెవ్వుమన్న కేకతో పడిపోయింది. తుమ్మ మొద్దుకి, తారుడబ్బా కి పుట్టిన సింగరేణి బొగ్గులా ఉన్నాడు. ఐరన్ లెగ్ శాస్త్రిని తలపై సుత్తి దెబ్బలేసి ఎత్తు తగ్గిస్తే ఎలా ఉంటాడో అదే ఆకారం లో (నిరాకారమేమో?) గుండ్రంగా ఉన్నాడు. కరెంట్ పోతే ఎక్కడున్నాడో పోల్చుకోవటానికి కళ్ళే ఆధారం, ఎందుకంటే పళ్ళు కూడా తెల్లగా లేవు.
పవన్ హాసిని ని ఐ-మాక్స్ కి తీసుకెళ్ళాడు. పవన్ ఉత్సాహం కోసం కాఫీ తాగితే, హాసిని షాక్ నుంచి తేరుకోవటానికి ఐస్ క్రీం తీసుకుంది. అయినా తనకోసం కష్టపడ్డ పవన్ మీద ఏదోమూల మంచి అభిప్రాయం. మొదటిసారిగా హాసిని నోటికి తాళం వేసిన మొనగాడు పవన్ (మాటలు ఆపినవాడే మొనగాడు). ఇద్దరుకాసేపు మాట్లాడాక ఇక వెళ్దాం అనిలేచింది. సరే హాసిని హాస్టల్ దగ్గరలో ఉందనగా ఒక స్నేహితురాలు స్వప్న కనిపించింది. హాసిని గుండెళ్ళో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఇతను ఎవరంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పగలదు, ఎలా చెప్పగలదు. హమ్మో తన పరువు ప్రతిష్టలు. స్వప్న బాగా దగ్గిరకి వచ్చేసింది. చేయి చాపింది. హాసిని కూడ చేయి చాపింది. కానీ స్వప్న చేయిని పవన్ ముందు అందుకున్నాడు. అయిపోయాను మొత్తం చెప్పేస్తాడు అనుకుంది హాసిని.
“మీరేంటి ఇక్కడ” అని అడిగింది స్వప్న.
“హాసిని ని కలవటానికి వచ్చా అని ” చెప్పాడు పవన్.
హాసిని ని ప్రక్కకి తోసేసి ఇద్దరూ ఆపకుండా పలకరింపులు, కష్టసుఖాలు కొనసాగించేస్తున్నారు. జీవితం లో వాగుడు తో తనకే చెక్ పెట్టిన జంటని మొదటసారి చూస్తుంది హాసిని.
హాసిని షాకు తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుమీద కళ్ళు తిరిగి పడబోయింది. ఆకలి వల్లనేమో అని స్వప్న,పవన్ హాసిని ని అన్నపూర్ణా రెస్టారెంటులోకి తీసుకెళ్లారు.
చికెన్ బిరియాని తెప్పించుకొని దుమ్ములురిచుకుంటూ,జోకులేసుకుంటూ హాసిని తింటుందో లేదో కూడా పట్టించుకోకుండా మాట్లాడేసుకుంటున్నారు స్వప్న,పవన్.వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది. వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు. అప్పటికే అటూ ఇటూ తిరిగిన సర్వరుకి ఆయాసం వచ్చింది. వండుతున్న వంటవాడికి గుండె నొఫ్ఫి వచ్చింది. ఇక ఆగలేక “మా దగ్గర కోళ్ళు లేవు. మేకలు,గొఱ్ఱెలు మీ దాటికి తట్టుకోలేక పారిపోయాయి. ఇక నేనే మిగిలాను నన్ను తినండి” అని టేబులెక్కి ప్లేటులో కూర్చున్నాడు సర్వరు. వాళ్ళకి ఎంత జాలేసిందంటే అంతజాలేసింది. “పచ్చిమాసం ఎలా తింటాం” అంటూ లేచారు.
ఒకగంట తరువాత పవన్ ఇద్దరికి చెప్పి బయల్దేరాడు. హాసిని స్వప్న ని బర బరా ఈడ్చుకొని లాక్కేల్లి అసలు వాడు నీకెలా తెలుసే అని ఆడిగింది. “ఏముందే మొన్న కుటుంబమంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు. పైగా పెళ్ళిచూపుల్లో మూడు రోజులు మా మూడు గేదెలు కష్టపడి ఇచ్చిన జున్నుపాలని జున్ను చేస్తే ముప్పై నిమిషాల్లో ముక్క మిగల్చకుండా మింగేసి నాకు జున్నంటే చాలా ఇష్టం. మీరే చేసారా. బాగుంది. అని ఒక పొగడ్త నా మొహాన పారేసి ఏ విషయం ఇంటికి వెళ్ళాక తెలియజేస్తాం అన్నారు. ఆ రోజు వాడి తిండికి జడుసు కున్న మా అక్క కొడుక్కి జ్వరం పట్టుకొని 10 నిమిషాల్లో 13 విరేచనాలయ్యాయి. ఇంకా గ్లూకోజు బాటిల్లు ఎక్కిస్తూనే ఉన్నారు. ఈ రోజు బిల్లు ఎలాగూ వాడిదే కదా అని ఒకపట్టు పట్టా ” అని చెప్పింది స్వప్న.హమ్మయ్య పొరపాటున తను బిల్లు కట్టడానికి కమిటవ్వలేదు అనుకుంది హాసిని.
పదిరోజుల తరువాత పవన్ కి స్వప్న కి పెళ్ళయిపోయింది. హాసిని తనని చూడటానికి వస్తా అన్న 21 వ పెళ్ళికొడుకు మహేష్ బాబు ని రావొద్దని చెప్పింది
🙂 atu aswin prema kathalu… itu mee hasini pelli choopula kathalu. Kevv… Comedy adirindi.
ha ha
katti post
hahaha……….“పచ్చిమాసం ఎలా తింటాం……….
fentastic……….nice creativity……..
🙂 D)
🙂
కొన్ని వాక్యాలు అదిరాయి
“ఆంధ్రా తాలి తెప్పించుకొని దానిలోకి సర్వర్ ని నంజుకొని తినేసింది.”
“తుమ్మ మొద్దుకి, తారుడబ్బా కి పుట్టిన సింగరేణి బొగ్గులా ఉన్నాడు”
చాలా బాగుంది. మూడవ భాగం ఎప్పుడొ??
బాగుంది మురళి, తర్వాత భాగం ఉందా మరి!
.వారి తిండి చూసిన హాసిని పక్షి జాతి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో అనుకుంది. వాళ్ళు మాత్రం పరుశరాముడు క్షత్రియ జాతిని నిర్మూలించినట్టు, ఆంధ్రప్రదేశ్ లో కోడీజాతిని నిర్మూలించటమే లక్ష్యంగా తింటూనే ఉన్నారు.
super…
as usual superb andi murali garu
wow..! kummEsaaru 🙂
Excellent!!! singareni boggu…. adirindi andi blog 🙂
murali garuuuuuuuuuuu..sooooooooooooooper post..
adirindi..katti….sry comment rasesariki kaasta late ayindi..
haasini..ha ha ha haaaaaaaa…:):):)
Super….
డేట్ మార్చి కూడలిలో పైన రాప్పించటం తప్పుడు పద్దతి . మీ బ్లాగు అచేతనం చేయబడుతుంది . జాగ్రత్త . ఈ కామెంట్ ను తీయవద్దు . ఇది అందరికీ ఒక హెచ్చరిక .
నేను కావాలని చేసిన ప్రయత్నంకాదిది. కొంతమంది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పైన ఉండేలా ఏం చేస్తున్నారా అని తెలుసుకోవటానికి ప్రయత్నించాను అంతే. నేనెప్పుడూ పైన ఉండాలని కోరుకోలేదు, నాకొచ్చే హిట్లను చూసి మురిసిపోవటంకానీ, తక్కువ వచ్చాయని నిరాశపడలేదు. నేను బ్లాగు రాస్తున్నది కేవలం నాకోసం, నా బ్లాగుని అభిమానించి చదివే కొందరికోసం. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మరలా చేయాల్సిన అవసరం నాకులేదు.
పైన కూడలి స్పెల్లింగ్ లో kodali ఏదో తేడా నిపిస్తుందేమిటో?ఈ కొడలి ఎవరబ్బా??!!!
వీవేన్ గారి తో మాట్లాడిన పిమ్మట పైన వచ్చిన వ్యాఖ్యలకి కూడలి కి ఎటువంటి సంభందం లేదని తేలిపోయింది. కావున ఈ వివాదాని కి తెరదించాలని భావిస్తున్నా. పైన వచ్చిన వ్యాఖ్యల్ని కూడా కొద్దిసేపట్లో తొలగిస్తా. ఈపాటికే ఆ వ్యాఖ్యలు చదివిన మితృలకు ఇబ్బంది కలుగ కుండా కాసేపు ఈ వ్యాఖ్యలని ప్రదర్శిస్తున్నా.
ఆ వ్యాఖ్యలను అలా ఉంచటం వల్ల ఒక నకిలీ కొడలి ఉందని అందరికీ తెలిసే అవకాశం ఉందికదా,తొలగించటం అనవసరం అని నా ఉద్దేస్యం.అయినా మీకు నచ్చినట్లు చెయ్యగలరు.
malemo aa link ni okka nokku nokkite adi manalni koodalike teesukeltundi
endukalaaaaaaaaa
mulali gaaalu mee haasini gaalu meelu keko kekaaaa andi
mee haasini gaalini oka saali palichaym cheddulu naaaku
naaaku aavilato maatlaaldaali ani vundi
endukante eevila punyamaa ani naaku “La” vachhettundemo aniii :):):):):)
keka
Superb
పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం