ముంగిలి » కవిత » నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

best friends

best friends

ఏటి ఒడ్డున ఇసుక మేటలు
ఓ నాలుగు చేతులు
గంటలో రాములోరి గుడి.

ఊరి మధ్యలో రాములోరి గుడి
గుప్పిట్లో కొబ్బరి ముక్క ప్రసాదం
కాకి ఎంగిలి.

ఊరి చివర జాతర
చేరో చేతిలో రూపాయి
పుల్ల ఐసు, రంగులరాట్నం.

లెక్కల మాష్టారి కోపం
ఒక చేతి పై వాత
నాలుగు కళ్ళలో నీళ్ళు.

పుట్టినరోజు పండగ
నాన్న ఇచ్చిన క్యాడ్బరీ చాక్లెట్
సగం సగం.

ఊరిలోకొచ్చిన కొత్తమ్మాయి.
బాబాయి హీరో సైకిల్
చెరో రౌండ్.

వాచీ పాతబడింది
పదవతరగతి పరీక్షలు
చేరో రైలు బెంగులూరు, హైదరాబాద్.

జుత్తు నెరిసింది
పిల్లల పెళ్ళి
రెండు మనసుల్లో తడారిపోని స్నేహం.

27 thoughts on “నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

  1. ఈ కవిత చదివాక మీరు రచయిత / కవి కాదని ఎవడైనా అనగలడా ?
    రాయుచ్చుకొని కొట్టే పరిస్థితి ఎక్కడిదండి ?
    ఆ శీర్షిక మార్చి స్నేహానికి సంబంధించిన మంచి శీర్షిక పెట్టండి. మా ” సుకవి ” కదూ !

  2. మీరు రచయితేనని మేం ఒప్పేసుకుంటున్నాం కావున మీరింక రాయిని పక్కన పడేయాల్సిందిగా కోరుతున్నాం రచయిత గారూ 😉
    మీ రాతలు నిజంగానే బాగున్నాయి సుమా.!

  3. మురళీ!! నువ్వు కవివి కాదన్న వాడిని కత్తన్న కత్తి లాంటి మాటలతో పొడిపిస్తా…(కత్తన్నా! నువ్వు రెడీగా వుండు)… బాగా రాశావ్ తమ్ముడు— ఇలాగే నీ స్టైల్లో ఇరగదియ్యి.

  4. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

వ్యాఖ్యానించండి