ముంగిలి » కవిత » నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

 

ముగ్ధ మోహనం

ముగ్ధ మోహనం

అమావాస్య చీకటిలో
కారడవిలో నడవలేనా?
…..నీ నవ్వుందిగా నా వెంట!

   *********

అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసి
నిన్ను మాత్రం దాచేసింది పాలకడలి
…..నా కోసం.

   *********

ఆ కొలనులో కలువలకి
నవ్వటం రాదు
…..నీ కళ్ళలా.

   *********

దేవుడికి ఇంకా అంతు పట్టలేదు
సప్తవర్ణాలు కాక ఏ వర్ణం తో చేసాడో
…..నిన్ను.

   *********

నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో!
పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ.

37 thoughts on “నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

  1. అద్భుతంగా ఉన్నాయి. వీటికి నానోలనో, నానీలనో పేర్లు పెట్టి పలుచన చేయద్దు. అలానే ఉంచేయండి. మధ్యలో గీతలు తీసేసినా భావం అర్ధంచేసుకోవటంలో లోపం ఏమీ రాదు.
    చాలా చాలా బాగున్నాయి.
    ఇక చివరది మరీ బాగుందని పైవాటిని తక్కువ చేయలేను.
    వర్ణచిత్రం తెలియని ఆలోచనలలోకానికి తీస్కొనిపోతోంది.

    పోస్టు పేరు చూసి ఇదేంటబ్బా ఈయనకేమయ్యిందీవాళ అనుకుంటూ వచ్చాను. 🙂

  2. మురళీ, ముందు ఆ కత్తి అవతల పారెయ్యండి. ఇక్కడ మీరు కవి కాదని ఎవరూ అనలేనంత చక్కగా రాశారు. చిత్రం కూడా చక్కగా ఉంది. ముందు శీర్షిక మార్చండి, లేకపోతే ఇక్కడ ఏవో కామెడీ కవితలున్నాయనుకుంటారు.

  3. మురళి కవి కాదన్న వాడ్నీ నేను రాయుచ్చుకొని కొడతా… 😛

    అయినా మురళి గారు.. ఇవి చదివి ఎవరైనా మీరు కవి కాదంటారాండీ.. !!!

    చాలా బావున్నాయండీ. నాకు పెద్ద పెద్ద కవితలకన్నా ఇలాంటివే ఎక్కువగా నచ్చుతాయి.

  4. @అబ్రకదబ్ర : :)) నేనూ అలాగే ఏదో వేయబోయా – మీరూ షార్ట్ న్ స్వీట్ గా వేశారు.
    @మురళి: షార్ట్ న్ స్వీట్ – పోస్ట్ టైటిల్ నుంచి పై కామెంట్ దాకా నా కన్నీ నచ్చాయ్.

  5. మురళీ గారూ! టైటిల్ సూపర్! అన్ని కత్తులని క్రింద పెట్టారుగా! మిమ్మల్ని ఎవరన్నా అందామనుకున్నా, మీరు పొడవక్కర లేకుండా అందులో ఏదో ఒకటెంచుకుని వాణ్ణి వాడే పొడుచుకు చస్తాడు లెండి! అని వై మీ ధైర్యాన్నీ, కవిత్వాన్ని రెండిటి పొగుడుతున్నానేం! అన్నట్లు కత్తుల రత్తయ్య మీ చుట్టమా?

  6. మీకు కత్తి అక్కరలేదని, కలముంటే చాలునని పెద్దలు చెప్పారు కాబట్టి, ఇక ఆ కత్తేదో ఇటిప్పించండి. భవిష్యత్తులో నేను కవిత ప్రచురించేటపుడు పనికొస్తది.

  7. చిత్రమేమిటో చిత్రమైన చిత్రానికే తెలుసు!
    మురళిలో ఏమిటో మురళీ గానానికే తెలుసు!

    There is poetry in the picture and a picture in your poetry.
    Get more passionate my friend, you will rule the world!

    వేదాంతం శ్రీపతి శర్మ

  8. ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక….

    మృదుమోహన మురళీ గానానికి ఇంత ఘాటు సువాసనలందించిన
    ఆ పరిమళం ఎక్కడ దాగుందో… మాకు చూడాలని ఉంది.

    కత్తితో కాదు కవిత్వంతో చంపేస్తా….. Really Heart touching

    మధ్యలో సున్నాలు తీసేసి మినీ కవితగా చేయండి
    అద్భుతంగా ఉన్నాయి భావాలు.
    ఎందుకైనా మంచిది . భద్రపర్చుకోండి.
    ఎప్పుడైనా అవసరమైతే పనికొస్తాయి.

  9. కత్తి కి తక్కువ
    కలానికి ఎక్కువ

    నేను కత్తి ప్రూఫ్ బట్టలు వేసుకొని తిరుగుతాను రేపటినుంచి

    పిల్లన గ్రోవి కి నిలువెల్ల గాయాలే
    అల్లన ఈ మురళికి తనువెల్ల గేయాలే

    బాగున్నాయండి

  10. ఆ టైటిలే నన్ను మీ బ్లాగులోకి లాక్కెళ్ళింది. ఒట్టేసి చెప్తున్నా … మీ కవిత్వం చాలా చాలా బాగుంది. మీరు కవి కాదనడనికి మాకెన్ని గుండెలు? ‘కవి యను నామంబు నీటికాకికి లేదా?’ అని ఎవడైనా అంటే వాణ్ణి కచ్చితంగా కత్తితో పొడవండి.

  11. అయితే ఇక మా వంతు.., “మీరు కవి కాదన్న వాళ్ళని మేము కత్తితో పొడుస్తాము” ..,

    చాలా చక్కగా రాసారు, అసలు pic అయితే సూపర్బ్.nice collection .

  12. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

వ్యాఖ్యానించండి