ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా
ఏడుస్తూ వస్తాం
ఏడిపిస్తూ పోతాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
కూడంటాం గూడంటాం
గుడ్డంటాం దుడ్డాంటాం
ఈడంటాం జోడంటాం
తాడంటాం బిడ్డంటాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నాదంటాం నీదంటాం
జాతంటాం మతమంటాం
పదవంటాం మదువంటాం
స్థాయంటాం స్థోమతంటాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
ఎదురుబొంగు పాడె మీద
కట్టెల మంటలోకి
ఆరడుగుల గొయ్యిలోకి
ఖాలీ చెయ్యితోటి
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీది లేదు నాది లేదు
గుప్పెడు బూడిద
మందిలేదు మతం లేదు
ఒంటరి బాట
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
ఉసురు పోయాక ఒట్టి ఊసే నువ్వు
మడుసుల మతిలో మిగిలే కతే నువ్వు
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా
nijame,,,bagundi mee kavita
super ra
well told the philosophy of life
chala chala bagundi..
chala bavundi
ఈ కవితలోని ప్రతి పంక్తీ బాగుంది. అందరికీ తెలిసినా వాస్తవాలే; అయినా అందరూ వాటిని హాయిగా మరిచిపోయి జేవిస్తున్నాం. అద్భుతంగా రాశావు తమ్ముడు !!!
ఏడుస్తూ వస్తాం
ఏడిపిస్తూ పోతాం
.
.
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా
శ్రీ మురళీధర్ గారికి, నమస్కారములు.
కవిత అతి సున్నితంగా వున్నది. బాగుంది. మరి మీ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా? శూన్యమనే విశ్వం నుంచి వచ్చి, తిరిగి అది విశ్వంలోకి వెళ్తుంటాము. శూన్యం/విశ్వం : దీనిని ఒక సున్నగా చూస్తే, సున్నాలోంచి, సున్నాను తీసివేస్తే, సున్నాయే మిగులుతుంది. అంటే, పోయింది లేదు, వచ్చిందీ లేదు. జీవులుకూడా అంతే.!
మీ స్నేహశీలి,
మాధవరావు.
chala baga rasarandi..
nenu naku nachinavi, tochinavi rastuntanu..
http://naahrudayaspandana-sushma.blogspot.com/
చాలా బాగా రాసావు అన్నా… నాకు బాగా నచ్హింది