ముంగిలి » కవిత » నేను కవినా? కానా?

నేను కవినా? కానా?

కోటి వెన్నెలల రాశి
కోటి వెన్నెలల రాశి

ఈ టైటిల్ కి సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళకి నా గత టపాల టైటిల్ గుర్తుందని నమ్ముతూ. ఇక చదవండి.

ఈ రోజు అమావాస్యంట
ఆకాశం వైపు చూసారేమో
ఓ సారి నువ్వు కనబడిరాకూడదూ.

    *****

నెలగంటు పెట్టారంట
సాయంత్రం బయటకిపోకు
చంద్రుడివసలే దిష్టికళ్ళు.

    *****

వేసవిలో వాకిట్లో మంచం
నిదురలో నీ అందం చూస్తూ
సూర్యుడు ఉదయించటం మరిచిపోయాడు.

    *****

ఓ వర్షాకాలం సాయంత్రం నవ్వుతూ నువ్వు
చినుకులు కోటి అద్దాలు
నా కళ్ళముందు ఇంద్రధనస్సు.

    *****

పాడు శీతాకాలం మల్లెలు లేని నీ జడ
ఆకాశానికి కోపం వచ్చిందేమో
మంచుపూలు నీ వాకిట్లో.

11 thoughts on “నేను కవినా? కానా?

  1. కవి కాదంటే కత్తి గుర్తొస్తుంది..
    పోనీ రచయిత కూడా కాదంటే రాయి గుర్తొస్తుంది..
    ఏమీ చెప్పకుండా వెళ్ళిపోదామంటే ఫొటోలో అమ్మాయి బాధపడుతుందేమో అనిపిస్తుంది..
    కాబట్టి, మీకు-మీరే!!!

  2. కనీసం ఆరు లైన్లైనా లేకపోతే, అది కవితే కాదని ఒక బ్లాగరు నా బ్లాగులో నాతో వాదానికి దిగారు. అలాంటి ఒకరిద్దరు ఏమంటారో గాని … మిగితా అందరూ మీది అచ్చమయిన కవిత్వమని ఒప్పుకొంటారు. మీరు మంచి కవి అని నా అభిప్రాయం. ఈ కవితలన్నీ కలిపి ఒక గ్రంథంగా వేయండి. మీకు మంచి ప్రఖ్యాతి వస్తుంది. ఆ గ్రంథానికి మాత్రం ” రాయుచ్చుకు కొడతా “, ” కత్తితో పొడుస్తా ” లాంటి టైటిల్ పెట్టకండే ! ఎంచక్క ” మంచు పూల వాన ” అనో, ” మల్లె పూల జాతర ” అనో, ” మెరుపు తీగల మాల ” అనో … నామకరణం చేయండి.

వ్యాఖ్యానించండి