హిమాలయం కరగటం చూసా
కరిగి వాకిట్లో సెలయేరుగా పారటం చూసా
మౌనం వీడి కేరింతలు కొట్టడం చూసా
నాతో కలిపి నట్టింట్లో కుప్పిగంతులు వెయ్యటం చూసా
నిలువెత్తుగా నిలబడ్డ గాంభీర్యం చూసా
తొణకని వ్యక్తిత్వం చూసా
చుక్కలనంటే ఆశయాన్ని చూసా
ఆదుకుంటా అనే అభయం చూసా
శిఖరం వరకూ మలచిన దారిని చూసా
దారి పక్కన ముళ్ళ పై రక్తపు మరకలు చూసా
కొండెక్కిన వెన్నెల చూసా
ఇవన్నీ నాకే అన్న సంఙ్ఞని చూసా
నాన్నా నువ్వే నా తొలిగురువు
నువ్వే నా మలిగురువు
నీ మౌనం,జీవనం ఒక పాఠం
నువ్వు నడిచే ఙ్ఞానం
ఎందరు వేలు పట్టి దిద్దించినా
ఎన్ని వేల పుస్తకాలు చదివినా
బ్రతకటం నేర్పేది మాత్రం
నీ వేలు పట్టి నడిచిన దారే.
ఈ దేహం నీది
ఈ రక్తం నీది
ఈ జీవితం నీది
నేను కేవలం నీ నీడని.
హృదయంగా ఉంది నీ కవిత.
clap…. clap
baagundi
ఎంతబాగా రాసారండీ..హాట్సాఫ్..
అద్భుతంగా ఉంది మురళి గారు చాలా బాగా రాశారు…
చాలా బాగుంది మురళి గారు 🙂
చాలా బావుంది. మొదటి నాలుగు లైన్లు మరీ ఆకట్టుకున్నాయి.
“అద్భుతం అనే పదం చిన్నగా (క)అనిపించడం ఇప్పుడే అనుభవమయ్యింది. నిజంగా “నాన్నారూ” అనే పదం లో ఉన్న (ఉన్న)తత్త్వాన్ని తొలి నాలుగు పంక్తుల్లో పదాలుగా మలచిన తీరు ….మాటలు వెతుక్కుంటున్నా….”
chala baga rasaru murali garu.meeru ila enno manchi kavithalu rastarani asistunnamu.thanking you