ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు
సక్కగా తిక్క శంకరయ్య పక్కజేరినవ్ లే.
ముగ్గురమ్మల పుణ్యమంటవ్
మూడు కళ్ళోడి పూజలంటవ్
కయిత్వాల్ రాస్తవ్
తత్వాల్ పాడతవ్
ఎండికొండోడు ఏమిచ్చిండొ ఏమో
కవులకు కనకాభిషేకాలన్నవ్
నీ కతల్, కయితల్ సల్లగుండ
నీ ఇస్టోరీ నే డిసైడ్‌జేసినా సూడు
రైలుబండోలింట పుట్టినవ్
ఏడు బోగిలతో చుకుచుకాడినవ్
తరగతిలా నాటకాలాడినవ్
మధ్యతరగతిలా బ్రతుకుల్ సదివినవ్
కధల్లేవ్ తెరదించాలంటే
సిరాలో కాయితాల్ ముంచినవ్
జంతువులచేత అండాలు పెట్టించినవ్
జనాలచేత దండాలు పెట్టించినవ్
ఏదికలెక్కుడు ఇసుగుపుట్టింద ఎమో
ఎండితెర ఎంటపడ్డవ్
ఆడోళ్ళకి కుట్టేటోడికి కధల్ కట్టినవ్
రాములోరి శివునికి వంతపాడినవ్
తోటరాముడూ అని కృష్ణుడు పిలిస్తే
పాన్ తీసి పెన్ మూసినవ్
ఆమె అన్నవ్ అతడన్నవ్
తిట్టించుకున్నవ్ భుజాల్ తట్టించుకున్నవ్
పాతికేళ్ళు నిండిపోయినయ్
కొత్త కళలు పుట్టుకొచ్చినయ్
నాడు గోగ్రహాణాల్ నేడు గ్రహణాల్
ఎండితెర మీద జర ఇంకుజల్లినవ్
ఆడ యాడో కొండ ఇరిగితే
ఈడ నీ గుండె పగిలినాది
కండ్లల్లా నీళ్ళు కురిసినయ్
కాయితాల్లా తత్వాల్ ఎలిసినయ్
అన్నిట్లా ఉండేటోడ్ని
అందరికీ సూపినవ్
నువ్వు ఆయన గుడులెంటపడితే
ఆయన నీ గుండెల్లో పండిండు
బాంచెన్ నీ కాల్మొక్కతా శంకరయ్య
యాడున్న మా భరణిని సక్కగా డిసైడ్ జెయ్.
ఏందన్నా, నువ్విట్ల డిసైడ్ జేస్తే మేమేం గావాలె? భరణి జూస్తే ఫిదా అయిపోతడు మరి !అసలే గాయన భీ శంకరుడి లెక్క బోలా మనిషే!
సిరాలోంచి శివుడు ప్రవహిస్తున్నట్టు ఉంది మీ పోస్టు. మీ కళ్ళతో భరణిని చూస్తే ఆది బిక్షువు ఒడిలో అల్లరి చేస్తూ ఆడుకునే పసిపాపడు కనిపిస్తున్నాడు.
Good one murali keep rocking
ఏం డిసైడ్ జేసినవయ్యా మురళి భయ్యా 🙂 చాలా బాగా రాశారండీ మురళి గారు.. ప్రతి వాక్యంలోను మీకు తనపై ఉన్న అభిమానం స్పష్టంగా కనపడుతుంది… అద్భుతం !!
Good effort ra.. slang lo consistency baga maintain chesav. But chivaralo aa explanations ivvakunda undalsindi.. padyam prose aipoindi.
భరణి అంటే నాకు కూడా చాలా అభిమానం.. ఎందుకో తెలియదు. పర్సనల్ గా తనతో పరిచయం లేకపోయినా ఏదో అటాచ్‌మెంట్ ఉన్నట్టనిపిస్తుంది. ఈ సందర్భంగా అతని జీవితం మరింత ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా.
ఈ పెద్ద మనిసి గిన్ని చెసిండు అని తెలీదురా భయ్…… సక్కగ సెప్పినవ్…
నువ్వు ఇట్లాగే 3 బ్లాగులు 6 బజ్ లా గుండాలిర భయ్
beautiful
అద్భుతం! మీ మాటల్లో భరణి గారు.. అద్భుతంగా దర్శనమిచ్చారు.. 🙂
చాలా బాగుంది.పైన శాస్త్రి గారు చెప్పినట్టు ప్రోజు తీసేస్తేనే బాగుండేది. కవిత కమ్మగా ఉంది.
–సూరంపూడి పవన్ సంతోష్.
కవితకి వివరణలివ్వటం నాకూ నచ్చలేదు. కానీ ఆయన నేపధ్యం తెలియని వారికి కొంత అర్ధం కాదని ఆలా వ్రాయాల్సివచ్చింది. తొలగిస్తున్నా.
adbhuthamgaa..undhi..Murali garu.. padyamainaa..vachanamainaa.. mee.. saili..super..
Once again kaTTipaDESaav my dear brother 🙂
>>> నాడు గోగ్రహాణాల్ నేడు గ్రహణాల్
ఇదొక్క వాక్యం చాలు సార్. మీ బుర్రలో సరుకు విలువ తెలియడానికి. స్థాలీ పులాక న్యాయం. మీరు మామూలోరు కాదన్నమాట. 🙂