అందరూ ఏంటి ఈ మధ్య బజ్జుల్లో పెళ్ళిగోల ఎక్కువయ్యింది. పెళ్ళి మీదకి మనసుపోయిందా అని అడుగుతున్నారు. అందుకే ఈ టాపిక్‌కి దూరంగా ఉందామని అనుకున్నా. కానీ ఏదో ఒకలా చుట్టూ తిరిగి నా చర్చలన్నీ అక్కడికే వస్తున్నాయి. కారణం 1983 లో పుట్టడం చేత పెళ్ళి వయస్సు వచ్చింది అని అందరూ అనుకోవటం చేత వగైరా వగైరా. ఇంట్లో వాళ్ళు పెళ్ళెప్పుడు చేసుకుంటావ్ అని తరుముతున్నారు. ఇక మా బ్యాచ్‌మేట్స్ ఒకేసారి గత రెండు నెలల్లో పెళ్ళి మాసోత్సవాలు చేసుకుంటున్నారు. ఒక డజను మంది స్నేహితులు ఈ రెండు నెలల్లో పెళ్ళి చేసుకున్నారు మరి. మిగిలిన వాళ్ళంతా యధాశక్తి పెళ్ళిచుపుల్లోనూ, మాట్రీమోని ప్రొఫైల్స్‌తోనూ బిజీ బిజీగా ఉన్నారు. ఎవరిని కదిపినా, ఎవరిని కుదిపినా పెళ్ళో పెళ్ళో అని ఒకటే గొడవ.
సరే మన టపాలోకి వస్తే ఇది పెళ్ళిగోలకి చెందినదే అయినా కాస్త భిన్నమైన గోల. పెళ్ళి అనగానే భయపడే కొందరి మానసిక స్థితి, పెళ్ళి చుట్టూ అల్లుకున అనుమానాలు, ఇప్పట్లో సాదారణంగా జరుగుతున్న తప్పులు ఇలా ఇదో భిన్నమైన గోల. ఒక స్నేహితురాలితో జరిగిన చాట్‌లో కొంత భాగాన్ని తీసుకుని ఒక టపాగా వేస్తున్నా. ఇది ఒక అబ్బాయి దృక్కోణం. ఇందుల్లో అన్నీ ప్రయోగపూర్వకంగా నిరూపింపబడ్డ వాస్తవాలు కాకపోవచ్చు. ఇవన్నీ నా మానసిక స్థితితో నేను పరిశీలించి ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. వీటితో అందరూ ఏకీభవించకపోవచ్చు లేదా ఫెమినిస్ట్‌లకి ఇది పురుషాధిక్యత అనిపించొచ్చు. కానీ నాతో ఏకీభవించే కొందరి కోసం, ఏ టెన్షన్ లేకుండా బ్రతకాలనుకునే కొందరికోసమే ఈ టపా.
ఆమె:ఇంట్లో పెళ్ళి అంటున్నారు మురళీ. కాస్త భయంగా ఉంది.
నేను:చేసుకో ఇంక లైఫ్‌లో మిగిలిన పెద్ద పని అదొక్కటేగా.
ఆమె:ఎలాంటివాడు వస్తాడో అని భయంగా ఉంది.
నేను:ఎవడ్ని చూపిస్తే వాడ్ని చేసుకోవుగా. ముందే మాట్లాడుకుంటారుగా. అప్పుడు నీకే అర్ధమవుతుంది.
ఆమె:నాకు సరిగా మాట్లాడటం చేతకాదు మురళీ. అయినా పెళ్ళిచూపుల్లో అందరూ మంచిగానే ఉంటారు కదా.అయినా అబ్బాయిలు మంచోళ్ళు కాదు మురళీ.
నేను:ప్రపంచంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. మనుషులుంటారు.కొందరితో మనకి మంచి రిలేషన్ ఉంటుంది, కొందరితో చెడుతుంది.అబ్బాయిలు బయటకి కనిపించేంత రఫ్‌గా ఉండరు. నిజానికి మనసులో చాలా సున్నితంగా ఉంటారు.
ఆమె:అవునా? :-
నేను:మొదట కొన్నాళ్ళు వాళ్ళకి నచ్చే విధంగా నువ్వుండు.ఒకసారి వాళ్ళు నిన్ను ఇష్టపడటం మొదలయితే నెత్తినపెట్టుకుని చూసుకుంటారు.ఒక అబ్బాయిగా చెబుతున్నా. అబ్బాయిలు ఒకసారి ప్రేమించటం మొదలుపెడితే ప్రాణంగా చూసుకుంటారు.
ఆమె:థాంక్స్ మురళీ.
నేను:పెళ్ళయిన కొత్తలో ఎక్కువమంది చేసే పొరపాటు,భర్తని బయట నుండి వచ్చినవాడిగా పుట్టింటి వాళ్ళని మనవాళ్ళుగా చూస్తారు.నువ్వు మాత్రం అలా చెయ్యకు.పెళ్ళయ్యి వేరేగా ఒక కాపురం పెట్టాక అబ్బాయికయినా, అమ్మాయికయినాతల్లిదండ్రులు కూడా భందువులయిపోతారు.అందుకే అమ్మాయిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే భర్త ఎప్పుడూ నీవాడే.పెళ్ళయిన కొత్తలో కొన్నిరోజులు తనకి నచ్చేవిధంగా ఉండు.తనకిష్టమైన పనులు చెయ్యు.కొన్నిరోజులు అలా ఉంటే తర్వాత నిన్ను మహారాణిలా చూసుకుంటాడు.
ఆమె:మీగురించి అన్నీ చెప్పేస్తున్నావ్. ఇంకా చెప్పు ఎలా ఉండాలి? 🙂
నేను:ప్రతీ మగాడు తన భార్య తనని విపరీతంగా ప్రేమించాలి అనుకుంటాడు. తన భార్య తనని ఒక హీరోలా చూడాలి అని కోరుకుంటాడు. వాడి జీవితంలో వాడు హీరోగా ఉండగలిగేది వాడింటిలోనే కదా!
ఆమె:సరే నేను బాగా చూసుకుంటా. ఇంకా?
నేను:అన్నింటికంటే ముఖ్యమైనది. ఏ మనిషి మరో మనిషిని 100% సంతృప్తిపరచలేడు. మన అన్నయ్య కంటే స్నేహితుల అన్నయ్యలు క్లోజ్‌గా ఉంటారు అనిపిస్తుంది. మన పేరెంట్స్ కంటే వేరే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ స్వేచ్చనిస్తారు అనిపిస్తుంది. బయటవాళ్ళకి మనవాళ్ళూ అలానే కనిపిస్తారు.
ఆమె:అవును నిజమే.
నేను:భర్త కూడా అంతే. అన్ని విషయాల్లో 100% నీఆశలని సంతృప్తిపరచలేకపోవచ్చు. వేరే ఎవరితోనో పోల్చుకుంటే అందంలోనో,డబ్బులోనో,బాగా మాట్లాడటంలోనో,ప్రేమను ప్రదర్శించటంలోనో కాస్త తక్కువనిపించొచ్చు.అలా ఎప్పుడన్నా అనిపిస్తే భర్త మీద ప్రేమ తగ్గించుకోకు. తనని మార్చే ప్రయత్నంచెయ్యు.
ఆమె:సరే 🙂
నేను:హృతిక్ రోషన్ అందగాడే. కానీ వాడొచ్చి నిన్ను ప్రేమగా చూసుకోడు. నీకు కష్టంవస్తే కన్నీళ్ళు పెట్టుకోడు. నీ భర్తే నిన్ను ప్రేమిస్తాడు. నీకు బాలేదంటే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి నీకు తగ్గేవరకు టెన్షన్ పడతాడు. నువ్వంటే ప్రాణం పెడతాడు. అందుకే ఈ ప్రపంచంలో నీ భర్తే నీకు హీరో,అందగాడు,మంచివాడు,ప్రేమికుడూ అన్నీ.
ఆమె:నువ్విలా చెబుతుంటే నాకు కాస్త ధైర్యం వస్తుంది మురళీ.
నేను:ఇంకొకటి చెప్పాలనిపిస్తుంది. చెప్పటానికి కాస్త ఇబ్బంది పడే విషయాలు కానీ ఎక్కువగా వింటున్న సమస్యలు, విడాకులకు దారితీస్తున్న సమస్యలు.
ఆమె:ఏంటవి?చెప్పు పర్లేదు.
నేను:ఏమీ అనుకోకు ఇలా చెబుతున్నందుకు.ఫిజికల్ రిలేషన్‌లో ఏదైనా సమస్య వస్తే బయటవాళ్ళకి చెప్పకు. మీలో మీరే మాట్లాడుకుని పరిష్కరించుకోండి.నీకేదైనా సమస్య ఉంటే తనకి చెప్పు. తన సహాయం తీసుకో. తనకేదైనా సమస్య వస్తే ప్రేమగా అడిగి తెలుసుకో. తనకి సమస్యపోయేవరకూ సహాయం చెయ్యు.
ఆమె:హ్మ్
నేను:అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే,You have to accept it. After all life is not just all about physical relation.పెళ్ళి కేవలం ఫిజికల్ రిలేషన్ కోసమే కాదు కదా. అది మాత్రమే కావలనుకుంటే పెళ్ళే అక్కర్లేదు కదా.
ఆమె:హ్మ్
నేను:రెండో విషయం. పెళ్ళయిన కొంత కాలానికి భర్తని చాలా దగ్గరగా చూడటం వలన కొన్నిలోపాలు కనిపించొచ్చు. భర్తకి మనమీద ప్రేమ తగ్గిందేమొ అనిపించొచ్చు. అలాంటి సమయాల్లో తెలిసిన వ్యక్తులో లేదా కొత్తగా పరిచయమయిన స్నేహితులో ప్రేమగా మాట్లాడితేనో, మన మీద కాస్త శ్రద్ద చూపిస్తేనో వాళ్ళ మీద మంచి అభిప్రాయం వస్తుంది. కొన్నాళ్ళకి అది ఆకర్షణగా మారుతుంది. ఇది కావలని చేసే తప్పు కాదు. మనిషి మనసే అంత. ప్రస్తుతం మన మీద ఎవరు ఎక్కువ శ్రద్ద చూపిస్తారో, ఎవరు దగ్గరగా ఉంటారో వాల్లనే పదే పదే తలుచుకుంటుంది. అలా దగ్గరయింది అమ్మాయే అయితే ఆమె మంచి స్నేహితురాలవుతుంది. అబ్బాయి అయితే ఆ దగ్గరితనాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోవటంతో రిలేషన్ దారి తప్పుతుంది. ఆలాంటి తప్పుకి ఎప్పుడూ ఆస్కారం ఇవ్వకు.
ఆమె:హ్మ్
నేను:అబ్బాయిలకి పెళ్ళయిన కొత్తలో మనకోసం ఒక మనిషి తన వాళ్ళందర్నీ వదులుకుని వచ్చింది అనే ఆలోచన అపురూపంగా అనిపిస్తుంది. పెళ్లయిన కొత్తలో ఉండే సహజభావాల వల్ల చాలా ఎక్కువ ప్రేమ ప్రదర్శిస్తారు. కొన్ని రోజులయ్యాక అబ్బాయిల మనసు భాద్యతల వైపు మళ్ళుతుంది. పిల్లలు పుట్టేలోగా ఒక ఇల్లు,కారు,బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలనే తాపత్రయం పెరుగుతుంది. అప్పుడు భర్తకి ముందున్నంత ప్రేమలేదని,ముందు గడిపినంత సమయం గడపటం లేదని అనిపిస్తుంది. కానీ వాడి తాపత్రయమంతా తన ఒక్కడికోసమే కాదు కదా. వాడు పడే కష్టం ఇద్దరి కోసం, రాబోయే పిల్లల కోసం. వాడు అంత ఆలోచిస్తుంటే మనల్ని పట్టించుకోవటం లేదనే నెపంతో మరొకరిపట్ల ఆకర్షణకు లోనుకావటం ఎంత దారుణమో కదా!
ఆమె:నిజమే ఇలాంటివి నేను విన్నాను కొన్ని.
నేను:నా భర్త, నా ఇల్లు, నా కుటుంబం అని ఆలోచించి ప్రేమ పంచు. అందులో నీకే తెలియని ఆనందం,సంతృప్తి దొరుకుతుంది. తను సమస్యల్లో ఉంటే అర్ధం చేసుకో, బిజీగా ఉన్నప్పుడు సహకరించు. అలా ఉంటే నెత్తినపెట్టుకుని చూసుకుంటాడు.
ఆమె:సూపర్‌గా చెప్పావ్. థాంక్స్.
నేను:మన జీవితం మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడూ సంతోషంగా ఉండు.
అదండీ మొత్తానికి జరిగిన చర్చ. ఇందులో అమ్మాయిలని మాత్రం ఎలా ఉండాలో చెప్పి, అబ్బాయిలు ఎలా ఉండాలి అనే అభిప్రాయాలు చెప్పలేదు అనిపిస్తే పైనుండీ కిందకి మళ్ళీ చదవండి.
chala adbhutam cheppavu brother..
vaasthavaniki chala daggara ga unna satyalu idi telsukunte andaru asalu samsyale undavu…
ok hero…:) అబ్బాయిలు ఎలా ఉండాలి అనే అభిప్రాయాలు చెప్పలేదు అనిపిస్తే పైనుండీ కిందకి మళ్ళీ చదవండి. ???? entidi ? ardham kaaledu ?
🙂 inta manchi vishayaalu cheppaaru. meeku abhinandanalu murali. I appreciate your concerns. God bless.
deeniki tODu naa tarapuna inko okka point.
okko saari mana mental state ni batti, situation ni batti arguments raavacchu. nijam gaa mana point correct ainaa sare, alaanti time lo edo prove cheyyaali, pakka vyakti naa point ippude ardham chesukovali anna taapatrayam vadilesi, veelainanta takkuva maatallo vishayam cheppi pakka vyakti ki ardham chesukovataaniki avasaramaina time n space ivvaali.
The real growth happens only in the night, quietly.
[night – i mean when surroundings are peaceful]
We can observe this around in the nature too.
pillalu, mokkalu niddatlone edugutaarata. ikkada nidra ante, mind relaxed ga unnappudu anukuntaa….
Manasu kooda ante ani grahimchaali.
Chala bagundi..
Chala Chala bagundi..
bright answers. keep it up murali. psychological ga cheppav.
congrats !
హమ్మా !
చాలా అనుభవపూర్వకంగా చెప్పినట్లుఉంది నీపోస్ట్. ఇక దిగులక్కరలేదు . పెళ్ళిచేసేస్కో .శుభం
purushudiki.. annitikanna goppa aasthi.. Bhaarya. meeru chaalaa baagaa chepparu. nice post. oka chinna maatalo me cheppanaa!? pellaina taewaatha rendu moodellu.. Bhartha ki.. nacche vidhamga Bhaarya unte.. tarwatha jeevithamanthaa.. Bhaarya cheppinatlu Bhartha vintaadu. Aham samtrupthi chendhadam lone undhi Vijayarahasyam.. congrats!!!
చాలా బాగుంది మురళి గారు.. బాగా రాశారు.
బాగుంది సోదరా,,
ప్రపంచంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. మనుషులుంటారు —- ఇది నేను ఎప్పుడూ అనుకునే పాయింట్ .. 🙂
నాకు టపా బాగా నచ్చేసింది..:)
సంభాషణాత్మకంగా చెప్పిన తీరు నాకు బాగా నచ్చింది.
నావి కొన్ని సూచనలు :
1. ఒకరినొకరు అర్థంచెసుకోవాలనే కుతూహలంలో పాత సంగతులు అత్యుస్త్సాహంతో చెప్పుకుకుంటాలు (పాజిటివ్ కావొచ్చు, నెగితివ్ కావొచ్చు) అవి తర్వాతిరోజుల్లో వికటించి వికృతంగా మారవచ్చు. కాబట్టి పాత సంగతులు కాలేజి, లివింగ్ అరేఅలోని మిత్రులు ఎంతవరకు అవసరమో అంతవరకే చెబితే బాగుంటుంది.
2. గర్భధారణ, దాని తర్వాత కలిగే భౌతికమైన మార్పులతోపాటు, హార్మోను సమతుల్యతలను, మార్పులను గమనించుకోవాలి. అది కొన్ని సందర్భాలలో భర్తకు అర్థం కాకపోవచ్చు. గమనించుకోవాలి.
3. కొన్ని నెలల తర్వాత వుద్భవించే ఇగో సమస్యను జాగ్రత్తగా డీల్ చెయ్యాలి. ఒకరకంగా ప్రశ్చన్న యుద్ధం (కోల్డ్ వార్) జరుగుతుంది ఎవరిది పైచేయి అయితే జీవితమంతా వారిదే పైచేయి అవుతుంది.
4. కోడలి స్థానంలో ఎదురయ్యే సమస్య నిజానికి పెద్ద సమస్య కాదు, అధికారపు స్థానాన్ని ఆక్రమించుకుంటుంది అనే భవనను రానియ్యకూడదు
ఎక్కూ చెప్పానేమో
Very near to the reality. Mottam nEnu nErchukundi manasuni manaku nachchinaTTu naDipistE yE prOblem undadani.:-)
Excellent murali 🙂 Real values needed …..Thanks.
పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం
chala bagundi…
muraligaru.. chala thanks andi, idi chadivaaka yae ammayi ayinaa pelli gurinchi positivega aalochisthundi, chala dhairyangaa vuntundi… chala thanks
thnx…..