ప్రియ నేస్తమా!
ఎన్ని జన్మల అనుభంధమో కదా మనది. ప్రతి జన్మలో పుట్టిన మరుక్షణంలోనే నేస్తమై, కడ దాకా నాతోనే ఉన్నావుగా. అలసట లేని అనుభంధం మనది. నువ్వు అవసరమైన ప్రతిసారీ అడగకుండానే వస్తావ్ నా వెంటే ఉంటావ్. ఇన్ని చేసిన నీకు నేను ఏ రోజు ఏమీ చెయ్యలేకపోయాను.
చిన్నప్పటి నుండి ఆకలేసినప్పుడు, ఆటల్లో ఓడినప్పుడు, నాన్న తిట్టినప్పుడు, టీచర్ కొట్టినప్పుడు ప్రతీ క్షణం నాతోనే ఉన్నావ్.
చేరువైన నేస్తం ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే నువ్వే,
ఙ్ఞాపకాలు ముసురుకుని చీకట్లో కూర్చున్నప్పుడు నువ్వే,
ఆప్తుడ్ని కోల్పోయినప్పుడూ నువ్వే,
ఏకాంతంలో కూడా ఓదార్పుగా నువ్వే,
అంతులేని అనందంలోనూ నువ్వే,
నువ్వు లేని ఏ క్షణం నా ఙ్ఞాపకాల్లో లేవు.
నాతో నా జీవితంతో ఇంతగా అల్లుకుపోయిన నిన్ను అంతా కన్నీరనే పిలుస్తారు. నిజానికి నువ్వు పన్నీరువేనేమో!
అంతులేని భాధ నన్ను అల్లుకుని, ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడక చనిపోతానేమో అనిపించినప్పుడు, ఎంత త్యాగం చేస్తావ్ నువ్వు. నా కంటి నుండి కాదు కాదు, నీ ఇంటి నుండి జారి ఆవిరై నీ ఉనికిని కోల్పోయి నా భాదని కరిగిస్తావ్. ఆవేదనలో దారి కనబడని అయోమయంలో కంటిని కడిగేసి ఓ దారిని చూపిస్తావ్. నువ్వే లేకపోతే నా హృదయం ఈ భాదల్ని తట్టుకోలేక ఏనాడో పగిలిపోయేది కదా!
అంతులేని అనందంలో మాటలు కరువైనప్పుడు మాటల కందని భావాల్ని మోసుకుని జారిపోతావ్. నేను కొత్త పాఠం నేర్చుకున్న నీ స్నేహంలో. కన్నీరంటే రెండు చుక్కల ఉప్పని నీరు కాదు. కన్నీరు ఒక ఎక్స్ప్రెషన్, ఒక భాష, ఒక కమ్యూనికేషన్ చానెల్. అందరూ అంటారు అంతులేని ఆనందాన్ని, ప్రేమని, భాదని చెప్పగలిగే భాష లేదు భూమి పైన అని. కానీ ఉంది ఎంత సంక్లిష్టమైన భావాన్నయినా చెప్పగలిగే భాష కన్నీరు. నీ గురించి వ్రాస్తున్న ఈ క్షణంలో కూడా కళ్లలో నువ్వే. ఎందుకంటే కన్నీరంటే ఏంటొ చెప్పటానికి నేను నేర్చుకున్న తెలుగు భాష సరిపోవటం లేదు. అందుకే మరలా కన్నీటి భాషే నా ఎక్స్ప్రెషన్.
నన్ను నేను నీతోనే కొలుచుకుంటాను తెలుసా? ఎక్కడో చదివా. నీ వలన ఇతరుల కళ్ళల్లో కన్నీటితో నీ పతనాన్ని, నీ కోసం నీ వాళ్ళ కళ్ళలో కన్నీటితో నీ విజయాన్ని కొలుచుకో అని.
అయినా నువ్వు నాకే కాదు అమ్మని, అక్కని, నా స్నేహితుల్ని అందర్ని ఆదుకుంటావ్, అందరితోనూ ఉంటావ్. నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్. కాదులే యూనివర్సల్ ఫ్రెండ్.ఇంత మేలు చేసినా నిన్ను ఎవ్వరికీ కనబడనివ్వరు ఎవరూ. కాస్త అహం దెబ్బతింటుందని. నువ్వు కావలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే వాళ్ళంతా నువ్వు భాదల్లో ఉన్నప్పుడు వస్తావను కుంటారే గాని, భాదని పంచుకోవటానికి, నీతో మోసుకుపోవటానికి వచ్చావని అర్ధం చేసుకోరు. సారీ దోస్త్.
ఈ జన్మలో కూడా కడ దాక నా తోడై ఉంటావు కదూ?
పూర్తిగా మన అనుభందం వ్రాయలేకపోయిన భాదలో కన్నీళ్ళతో
నీ మితృడు
మురళీ.
కన్నీటి కావ్యానికి తొలి పుట!
బాగా రాస్తారు మీరు.
కన్నీరే కదా కడదాక మననేస్తం!
నాకూ జీవితంలో ఇద్దరు ప్రియనేస్తాలు ఉన్నారు. మొదటిది మీకులాగే ఓ కన్నీటి చుక్క.; రెండవది ఆరడుగుల సామ్రాజ్యం… మొదటిది అప్పుడప్పుడూ నన్ను పలకరిస్తూనే ఉంటుంది. రెండవది మాత్రం నాకు కాబోయే చివరి నేస్తం.
మీలాగే నేనూ కన్నీరు గురించి రాసుకున్నాను ఇలా…
” కన్నీటిచుక్క కన్నీటిచుక్క ఎక్కడ ఉంటావమ్మా నువ్వెక్కడ ఉంటావమ్మా…
కంటిపాపల చాటునా… గుండెలోయల మాటునా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
నువు తాకని కనుపాప ఉలి తగలని శిల కాదా…
నీ వెచ్చని కౌగిలితో ఓదార్పే జత కాదా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా…
ఈ మనసు మురిసే వేళలో ఆనంద బాష్పానివై…
ఇదే మనసు పొగిలే వేళలో వడగళ్ల వర్షానివై…
తడుపుతావే నిలువెల్లా; అణువు అణువు తడిసేలా…
ఎక్కడ ఉంటావమ్మా… నువ్వెక్కడ ఉంటావమ్మా… “
mii saili naaku baagaa nacchindi. miiru bhavukulu ani anipistundi. enni synthatic smiles unnaa okka chinna chirunavvu manasulonchi vacchina daanito saripolavu. mii blog baagundi.
touched
very nice blog.
srinivasa raju gaaridi kudaa baavundi.
ento amri comment publish kaavadam ledu
మంజుగారూ మీ కమెంట్లు కనిపిస్తున్నాయే.
చాలా చాలా బాగుంది.. 🙂