ఆకాశం వైపే నిశ్చలంగా చూస్తున్నా
ఆశతో కాదు
ఆవేదనతో.
కాలంతో సమాంతరంగా పరిగెడుతూనే ఉన్నా
జీవితాన్నో, ప్రపంచాన్నో
ఇంకాదేన్నో తెలుసుకోవాలని.
తీరం తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలు
దప్పికతో దహించుకుపోయా.
కనుచూపుమేరా సాంద్రంగా పేరుకున్న ఇసుక
అయినా ఆగలేని నిస్సాహయత
సాగలేని నిరాసక్తత.
ఇంకెన్ని అవంతరాలు అవరోదాలు
చాలు భగవాన్ ఈ పరీక్షలు
ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?
>>ఇకనైనా చెప్పు నన్ను ఎందుకు పుట్టించావ్?
ఈ అవంతరాలు, అవరోధాలు ఎలా దాటుతారో చూద్దామని..
కవిత బాగుంది. కవితావేశం మీలో ఎక్కువే అనుకొంటా.
“తీరం తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలు”
మా తరం భావకవి మా మురళి….
నాదీ కౌటిల్యమాటే….. సగర్వంగా చెబుతున్నాను.
నీలో వున్న నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అంతర్ముఖుడివి కావాలి
heart touching one………….nice work murali garu………