నువ్వేంటో నాకు ఎప్పుడూ అర్ధం కావు
నేను నీకు కూడా.
అవునంటావ్ కాదంటావ్.
నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.
నేను నిన్ను నమ్ముతాను కానీ కొన్నిసార్లే.
నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో నమ్మకం
నిజమా కాదా అనే అనుమానం.
నువ్వు సీతాకోకచిలుకనంటావ్
గువ్వనంటావ్
పావురాయినంటావ్.
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.
అడక్కుండానే మనసులోకి చొరబడే చొరవ చేస్తావ్
చెప్పకుండానే గుండె చీల్చిపోతావ్.
నాకెప్పుడూ అయోమయం
నువ్వు నాతోనే ఉన్నావా? లేవా?
నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.
Beautiful మురళి గారు.. ఎలా దొరుకుతాయండీ మీకు అలాంటి పదాలు, వాక్యాలూ? మనసులో మాటాడుకునేవన్నీ ఇలా బయటపెట్టేస్తే ఎలా చెప్పండీ..?:)
ఇప్పటికి పదిసార్లు చదివా మురళీ…ఇంకా చదవాలనిపిస్తుంది…
“జన్మ జన్మల అయోమయం ..ఈ ప్రేమ”
కొన్ని నిజాలు నిష్టూరంగా ఉంటాయి మీ కవిత లాగ 🙂 🙂
caalaa caalaa baavundanDi.
బాగుంది.
superb. awesome
i do not know words…to express
చాలా,చాలా….చాలాబాగుందండి!
excellently done….
చిత్త చాంచల్యాన్ని బాగా బయటపెట్టారు. మంచి కవిత..
నేను మాత్రం నీటిలో కొంగని
ఒంటికాలి పై నిలబడి
దీర్ఘంగా శూన్యంలోకి చూస్తూ.
japam japam japam konga japamaa….? very funny!
నేటి యువతలోని ద్వైధీ భావనలు, సంకుచిత యోచనలు, సెల్ఫ్ సెంటర్డ్ థింకింగ్, అంతా వన్ వే…. . అభినందనలు.యీ క్రింది పదాల్లో చక్కగా వ్యక్త పరిచారు.
“నువ్వు అవునన్నా నాకు అనుమానం
కాదంటే ఆవేదన.”
అభినందనలు….. నూతక్కి
nice one chala bavanudhi nenu mee blogs follow chestuntanu … chala bavuntai mee kavitalu
నీకు నేను కావాలి
కానీ నాతో ఉండవు.
నువ్వులేకపోయినా నేను ఉండగలను
కానీ వదలలేను.
ఏమి చెప్పారండీ
I love your blogs.