ఇంటిలో ఉన్న పాత పుస్తకాలన్నీ దులుపుతుంటే నేను కవితలు వ్రాసుకునే పుస్తకం కనిపించింది. పదేళ్ళక్రితం ఇంటర్ లో వ్రాసుకున్న కవితలు చాలావరకూ ఇమ్మెట్యూర్ అనిపించాయి. నాకు కాస్త గమ్మత్తుగా అనిపించిన ప్రేయసి దండకం ఇది. కొత్త కొత్త ప్రయోగాలు,కనీవినీ ఎరుగని పదాలు కనిపిస్తే కంగారు పడకండి.
ఓ ప్రియా,
మందారముఖి కమలాక్షి
కరుణామయి దయార్ద్రహృదయి
మదీయమానసచోర కోమలాంగి
నాదు హృదయగర్వభంగి
పాహిమాం పాహిమాం పాహిమాం
ననుభందించు నీకురులనుండి
బుసలుకొట్టు నీదు భృకుటీద్వయం నుండి
చురకత్తుల చూపులనుండి
నిట్టూర్పుల వడగాల్పులనుండి
పాహిమాం పాహిమాం పాహిమాం
మైమరపించు చిరునవ్వుల నుండి
ఆకర్షించు చెక్కిళ్ళ నుండి
తేనెలూరు పలుకుల నుండి
నీదువయ్యారపు నడకల నుండి
మంచువంటి మనసు నుండి
పాహిమాం పాహిమాం పాహిమాం
నీసోయగంబు వర్ణించ నేనెంతవాడినే
నీగుణగణంబుల్నెంచ నాకేమితెలుయునే
నీదు దాసుడన్,నిను సేవించు భక్తుడన్
నాయందు కరుణించి చీత్కారముల్ విడచి
కటాక్షవీక్షణముల్ ప్రసరించు
నాపై నీప్రేమామృతము కురిపించు
దేవి కారుణ్య హృదయి
పాహిమాం పాహిమాం పాహిమాం
ఇంతకీ మీ దేవత కరుణించిందా ? లేదా?ఆమెకి చూపించారా లేదా?
ఫోటోలో లాంటి అమ్మాయైతే మాకు ఓకే.. ఒక్కముక్క చెప్పితే చాలు గిఫ్టుల్తో వాలతాం.
సార్థక నామధేయం.. బ్లాగుకీ మీకూ…..
( just to tease.. )
చాలా బాగుంది.
మురళీ…ఇంత అందంగా మందారముఖి,కమలాక్షి అని పొగిడి, ఏమీ తెలియదని అమాయకంగా వేడుకుంటే, ఏ ప్రేమ దేవత కరుణార్ద్రహృదయం కదలదు చెప్పు…..
ఇది స్తోత్రం కాదు, ఇటువంటి రచనని దండకం అంటారు
నిజ్జంగా ఈ స్తోత్రం ఆమె ముందు చదివి వుంటే తప్పక కరుణించి వుంటారు. కానీ ఇది పేజీల మద్య ఇరుకునపడ్డది లానే అనిపిస్తోంది. అంతేనా?
baagu baagu… ee sthothram memekkadainaa vaadukunte.. meekemi abyantharam ledugaa…;)
ఆమె కరుణించక, మాకో కవిని ప్రసాదించెనా..?!! 😉