ఙ్ఞాపకాల పుస్తకాల్లో దాచుకున్న గులాబీలు
వాడిపోయాయి
పరిమళం పోయింది
తాకితే రెక్కలు రాలిపోయాయి
రెక్కల్ని తరచి తరచి తాకి చూస్తే
పరుచుకుంటున్న దృశ్యాలు
దృశ్యాల వెంట పరిగెడుతుంటే
ఎన్నో మలుపులు
ప్రతి మలుపులోనూ చిక్కుకున్న భావాలు
అప్పుడు దాచుకోలేక ఇప్పుడు ఏరుకుంటున్నా
ఎవరో తొంగి చూసారు
పుస్తకం మూసేసా భయంతోనో, అపరాధ భావంతోనో
ఇది చదివి నా తలను గోడకెసి ఎన్ని సార్లు కొట్టుకున్నానొ తెలియదు… కింద పడి లెచాక… మళ్ళీ గుర్తొచ్చి .. అక్కడే ఉంటే ఋం అఘాయిత్యం చేసుకుంటానొ అని భయపడి…. బయటకి పారి పోయా…
@ RAMK : నేనూ అంతే , కాకపొతే, ఎర్ర గులాబీ ని చూసి తేరుకుని ఇది తెరాస కు సంబందించినది కాదు, జ్ఞాపకాల పరంపర అని తెలుసు కున్నాను.
@ మురళీ గానం: తెరాస హవా కదా ! వాడిన గులాబీ అంటే అలానే అనుకుంటాం. సారీ అండీ
మన కోసం మనం వ్రాసుకున్న కవితలులో
కొన్ని కొందరికి నచ్చుతాయి,
కొన్ని ఎవరికీ నచ్చవు.
డోంట్ వర్రీ, యాజ్ లాంగ్ యాడ్ యు లైక్ ఇట్
Nice one.
గులాబీలు వాడినా మనసులో అనుభూతులు సజీవంగానే ఉన్నాయిగా…. వారి జీవితపు పుస్తకంలో అలాంటి గులాబీలు బహుశా లేవేమో పాపం !!!
@ sky : అంతక్లియర్ గా చెప్పినా మీకు అర్ధం కాలేదా ?
వాడిన గులాబి రేకులు అంటే తెరాస అనుకున్నాను , తెరాస హవా కాబట్టి అలా అనుకున్నాను
నా జీవితపు పుస్తకం లో కూడా ఎన్నో “గులాబీలు”, కొన్ని ముళ్ళు ఉన్నవి, మరి కొన్ని ముళ్ళు లేనివి .
చాలా బాగారాశారు . మనసుకు హత్తుకునేలా ఉంది కవిత. 🙂
good thought… every one got similar feeling of their past. few speak about it and few don’t.
However, it is a great feeling to lookback …
Nice one…