ముంగిలి » కవిత » ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

Heart_Broken_by_Blackmago

She Broke My heart

ఆమె ఎప్పటిలానే నన్ను వదిలి వెళ్ళిపోయింది.

వీధి దీపాల్లో నేను వ్రాసే పిచ్చిరాతల్లో జీవితం లేదని వెళ్ళిపోయింది.

కళ్ళలో కోటి ఆశలు, ఏన్నో ఊహలు,కలలు

వీటిలో ప్రాక్టికాలిటీ లేదని వెళ్ళిపోయింది.

దూరంగా ఆకాశం, నేల కలిసిపోతుంటే

అనందంతో గంతులు వేస్తున్న నన్ను చూసి

వీడింతే లోకం తెలియని వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.

సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను

సంభ్రమంగా చూస్తున్న నన్ను చూసి

వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో అని తేల్చేసి వెళ్ళిపోయింది.

తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు

తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు

పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.

తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో.

నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో .

ఈ ఊరికి ఆ ఊరు,ఆ ఊరికి ఈ ఊరు ఒకే దూరంలో లేవెందుకో?

21 thoughts on “ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

 1. నిజానికి మీ కవితలోని భావాలను అందుకోవలంటే
  బాద సాంధ్రత తెలియాలి ఎవరికైన, జాలి మాత్రం కాదు…

  ఇలాంటి బాదను నేను కూడా అనుభవించాను మిత్రమా..
  అందులోని నరకం నకు పరిచయమే
  ఐనా బాద వద్దు మిత్రమా…అంతా సహజమే కదా
  ఇక్కడ…

 2. “తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో.

  నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో .

  ఈ ఊరికి ఆ ఊరు,ఆ ఊరికి ఈ ఊరు ఒకే దూరంలో లేవెందుకో?”

  మనుషుల మనసుల మధ్య ఏర్పడే అగాధాలని చాలా బాగా వ్యక్తీకరించారు.

 3. ప్రేమ పొందటం అనేది ఓ గొప్పు వరం…అలాంటి అదృష్టం అందరికీ దొరకదు….ఒకవేళ అది దొరికినా అది ఎంత గొప్పదో తెలుసుకోలేని అభాగ్యులు కొందరుంటారు….ఏం చేస్తాం…వారంతే!!!

  బాగా రాసారు…

 4. చాలా బాగు౦ది..కవితలోని భావ౦ స్వానుభవ౦ తో రాసి౦దైతే అద్బుత౦ గా రాసారు మీ మనసు భాధని.ఇది మీరు ఉహి౦చుకుని రాసిన భావమే అయితే కనుక అత్యద్బుత౦ ..

 5. మురళీ !

  రైలెక్కినప్పుడు మనతో ఆపెట్టెలో చాలమంది ఎక్కుతారు. వాళ్లలో కొద్దిమమ్దిపట్ల లేక ఒకరిపట్ల మనకు కొద్ది అనుబంధం ఏర్పడవచ్చు. అంతమాత్రం చేత వీళ్ళంతా మనవెంటే ,మనష్టేషన్ దాకే వస్తారని ఆశించరాదు. ఒకవేళ మనందిగాల్సిన స్టేషన్ టిక్కెటే ఇంకొకరి దగ్గరున్నాగాని వాళ్ళూ ఆశ్టేషణ్ దాకా వస్తారనే గ్యారంటీ ఏమీ లేదు.

  వాస్తవానికి చూస్తే మొదటి నుంచి చివరదాకా తోడుం<డేవాడూ ఒక్కడే. మనమేమో ఆఒక్కడి నిజాయతీని నమ్మక ,మాయామోహితులమై మాయాబంధాలతో కూడుకున్న సహప్రయాణీకులను మాత్రమే నమ్ముతాము.

  ఓసారి లోతుగా ఆలోచించి చూడు .ఈ వయస్సులో నువ్వైనా ఆవయస్సులో మేమైనా ఈ మాయాబంధాలపట్ల ఆకర్షితులముకావటం లో ఆశ్చర్యం లేదు. పసివాడు దీపాన్ని పట్టుకోవాలనుకోవటం లాంటిదే ఇదీను .

  ధీమంతుడవుకావాలి. బేలవై అసలు విషయాన్ని గ్రహించక నీశక్తులను వృధాచేసుకోకు. ప్రతిప్రాణిపుట్టుకకు ఏదో లక్ష్యం నిర్దేశించబడివుంటూంది భౌతికంగా . లోతులోకి వెళితే అసలు లక్ష్యం దానంత అదే అర్ధమవుతుంది.
  ప్రాణితనపోరాటాన్ని ఎవరిసహాయాన్నివెంతబెట్టుకుని ప్రారంభించదు.అలానే తోడువచ్చిన వస్తారనుకున్న వారు ,తప్పుకుంటే విరమించదు.ఈ గాలితాకిడులకు తల్లడిల్లే పిరికివాడిగాకాదు. పెనుతుఫానులను సహితం ఎదురొడ్డి చలించిన మహోత్తంగ గిరిశిఖరంలా మాకు కనపడాలి .దిగ్విజయీభవ

 6. మురళీ !పుట్టిన ప్రతి జీవీ సర్వ స్వతంత్ర మైనది. జీవితాన ప్రతి వ్యక్తికి స్వంత అభిరుచులు, ఆకాంక్షలు,వుంటాయి.సర్దుకు పోయేవారు కొందరైతే,నిర్మొహమాటంగా నిక్కచ్చిగా వ్యక్త పరిచేవారు మరి కొందరు.మన కల్పనాలోకంనుంచి మనమూ బయటపడి తోటివారి మనోగతాలు తెలుసుకొని వ్యవహరించడం,యీ వ్యావహారిక లోకంలో ఎంతో అవసరమని సున్నితంగా చెప్పారు మాష్టారూ.అభినందిస్తూ…..నూతక్కి

 7. పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s