ముంగిలి » చర్చ » ఈ ఉగాదికి ఏంచేద్దాం?

ఈ ఉగాదికి ఏంచేద్దాం?

ఈ ఉగాదికి ఏంచేద్దాం? ఎప్పటిలాగా ఉగాది పచ్చడి తిని, పంచాంగం విని పడుకుందామా? లేదా కొత్తసంవత్సరం ఏదయినా కొత్త పనితో మొదలు పెడదామా? నేను నా కొత్తసంవత్సరాన్ని ఖచ్చితంగా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒక సమావేశంలో కత్తి మహేష్ గారు చెప్పారు “తెలుగును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పి అందర్ని ఒప్పించాలి. అప్పటికీ తెలుగుని బ్రతికించుకోగలమా అంటే ఎమో చెప్పలేం. తెలుగుతనాన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది”. అక్షరలక్షలు చేసేమాట. కానీ ఎలా? ప్లేకార్డ్లు పట్టుకుని రోడ్డు మీద తిరగాలి, ఫ్లెక్స్ పెట్టాలి విస్తృత ప్రచారం చెయ్యాలి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ చేయనక్కరలేదు.

స్వాతంత్ర్యం ఎలా అయినా సంపాదించుకోవాలి అని ఆవేశంలో ఊగిపోతున్న భరతజాతికి ఆయుధంలా మారి అందరిని ఒక్కతాటి పైన నడిపించింది ఒకచిన్నమాట కాదు ఒక మహామంత్రం “వందేమాతరం”. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని ఒక్కటి చేసేది, చూడగానే తెలుగువాడిగా గుర్తింపునిచ్చేది ఏదయినా ఉందా? ఉంది మన కట్టూ,బొట్టూ. మన కట్టూ,బొట్టూ కార్పొరేట్ కంపేనీల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం మందిగా గుర్తించిన, గౌరవిస్తున్న మన వస్త్రధారణతోనే తెలుగుతనాన్ని చాటిచెబుదాం. ఆంధ్రులు ఆరంభశూరులని ఉన్న అపవాదుని చెరిపేసుకుందాం. మన కార్యక్రమాలకి ఇది కొనసాగింపేకానీ అదనపు భారంకాదని భావిస్తున్నా.

చేయాలనుకుంటున్న కార్యక్రమాలు :

1.ఉగాది రోజు అందరం తెలుగు సంప్రదాయ వస్త్రధారణని పాటిద్దాం. 10కె రన్, బత్తీబంద్‌లకి మద్దతునిచ్చిన ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ కంపెనీలు దీనికి కూడా మద్దతునిస్తాయని బలంగా నమ్ముతున్నా. ఇప్పట్నుండీ మీ కంపేనీల్లో సంభందిత వ్యక్తుల్ని సంప్రదించండి. ప్రతి ఉగాదికి చేసేదే కదా ఇందులో ఎముంది గొప్ప అనుకుంటున్నారా? ఇలానే ప్రతినెలలో ఒకరోజు పాటిద్దాం. శ్రీలంకలో ప్రతీ పౌర్ణమికి మా కంపెనీ సెలవిస్తుంది. కారణం ఆ రోజు వారికి సంప్రదాయదినం. గుడికి వెళ్ళటం ప్రార్ధనలు చెయ్యటం వంటివి చేస్తారంట. మనం అలానే ప్రతీనెలలో ఒకరోజు సంప్రదాయ దుస్తులని ధరిద్దాం. రాష్ట్రం మొత్తం ఒక్కరోజు మన సంప్రదాయ దుస్తుల్లో, లంగావోణీల్లో అమ్మాయిలు, పంచె కట్టులోనో లేదా కుర్తాల్లో అబ్బాయిలు అహా చూడాటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో

2.దీనికోసం మనం ప్రముఖ ప్రసారమాధ్యమాల మద్దతు లభిస్తుందేమో ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని భావిస్తున్నా.

3.”నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.” అనే బ్యాడ్జి ధరిద్దాం. ఇవన్నీ తెలుగువారి జీవితంలో ఒకభాగం అయ్యేంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత తెలుగే మనల్ని నడిపిస్తుంది.

నేను పైన చెప్పిన పనులు చాలా చిన్నవి, సులువైనవి అని భావిస్తున్నా. నేను గతంలో గాని ఇప్పుడూ గాని ప్రతిపాదించినవి ఆచరణ సాధ్యమైనవి. మనకి మరింత బలాన్నిచ్చేవి. బ్లాగర్స్ డే చేసుకుంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుందని నా బ్లాగులో రాసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ-తెలుగు కార్యక్రమాలకి ఉత్సాహం మొదలయినది అక్కడే అని అందరికి తెలుసు. చివరిగా వీవెన్ గారు చెప్పినట్టు, “ఎవరికోసం ఎదురు చూడకు నువ్వు చేయాలనుకున్నది చేసెయ్”. అవును అందుకే నేను ఇది చెయ్యబోతున్నా. సోదరుడు సతీష్‌కుమార్ యనమండ్ర నాతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. ఆయన తన కంపెనీ లోని ఉద్యోగస్తులకి ఆచరించమని కోరుతానన్నారు. ఇంక మీ సమాధానం మిగిలుంది. రండి కలిసి నడుద్దాం. తెలుగు విప్లవంలో పాలుపంచుకుందాం.

4 thoughts on “ఈ ఉగాదికి ఏంచేద్దాం?

 1. ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన నా సోదరుడికి నా మద్దతు ఎప్పుడూ వుంటుంది. కార్పోరేట్ కంపెనీలను కూడా వొప్పించవచ్చు అని నా నమ్మకం. ప్రచార మాధ్యమాలు మనకు సహకరిస్తాయి అని నా నమ్మకం.

  నా వరకు నేను ఈ కార్యక్రమాన్ని నా కంపెనీ లో ఆచరణ లో పెట్టబోతున్నాను. నా స్నేహితులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయగలను.

  మురళీ– నీలాంటి సోదరుడు నాకు వున్నందుకు గర్వంగా వుంది.

  — సతీష్ యనమండ్ర

 2. I need to say few more things about my brother— తెలుగులో నా భావాలను చెప్పలేక ఆంగ్లంలో రాస్తున్నాను ( క్షమించండి). When I met him for the first time, he appeared just like a next door guy. When I started talking to him, I could sense the depth of his thoughts and his observations. His views are simple but mind blowing. I wonder how this guy could get such great thoughts.

  He is definitely an inspiring person and an asset to E-Telugu. The way he forecasts future is amazing. Looking forward for more ideas which will make E-Telugu to bring back the golden glory of Telugu language, Telugu traditions and customs…..

  I wish this young boy a very bright future and I know that you guys also shower your blessings and support him.

  Murali- I am really proud that you are friend and honored when you accepted me as your brother.

  Keep Rocking. I am always with you.

  with love,

  Sateesh Kumar Yanamandra

 3. ఉగాది రోజున సాంప్రదాయికంగా ఉండే ఆలోచన బాగుంది. ప్రతీనెలా ఒకరోజున అలా అమలు చెయ్యడంలోని సాధక బాధకాలను కూడా పరిశీలించాలి. ముందు ప్రజల్లో మీరు చెప్పిన భావచైతన్యం తీసుకురాగలగాలి. సంవత్సరాల తరబడి జరగాల్సిన ప్రచారమది.

  ఇలాంటి పనులు జరగాలంటే..
  1. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనాలి. తమ జీవన శైలికి విరుద్ధంగా జరిగే పని ఇది. నెలకోసారి ఖచ్చితంగా జరగాలంటే ప్రజల్లో ఎంతో నిబద్ధత ఉండాలి. దైవభక్తికి మాత్రమే అంతటి శక్తి ఉంటుందని నా ఉద్దేశం.

  లేదా

  2. తప్పనిసరి చెయ్యాలి. దీన్నెవరూ హర్షించరు.

  ఒకటి.. గుడిలోకి పంచె, చీరలకు మాత్రమే ప్రవేశం అని పెడితే చాలు – ఏ ప్రచారమూ అక్కరలేదు.

  ప్రతీ నెలా ఒక రోజున అని కాకుండా ప్రతీ పండక్కీ అలా చేద్దాం అని అనొచ్చేమో! ముందు పెద్దయెత్తున ప్రచారం కూడా కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s