ఇది చిరు పార్టీ ప్రచారం కోసం అనుకునేరు. నేను చెప్పేది మన తెలుగు బ్లాగుల గురించే. మీకు గుర్తుంటే నేను 1000 మంది సందర్శకులు వచ్చారని టపా రాసినప్పుడు చెప్పాను నా బ్లాగు నేనే బలవంతంగా చదివిస్తున్నా అని. కానీ ఇప్పుడు రోజులు మారాయి. నేను మంచి బ్లాగులని మా స్నేహితులకి, ఆఫీసులో వాళ్ళకి మెయిల్ ద్వారా పంపటం మొదలుపెట్టా. మొదట్లో ఇంత పెద్ద మెయిల్స్ ఏం చదువుతాం అని విసుక్కున్నారు. ఖాళీ గా ఉన్నప్పుడు కొంచెం గా చూసేవారు. ఇప్పుడు మా వాళ్ళకి పనిలో ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇదో మార్గం అయ్యింది. ఇప్పుడు వారాంతం లో ఇంటి దగ్గర చదువుకోవటానికి, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బెంచి మీద ఉన్నవాళ్ళు ఏవన్నా మంచి బ్లాగులు సూచించమని అడుగుతున్నారు. రెండు నెలల్లో గణనీయమైన మార్పు. నాకు చాల ఆనందం గా వుంది. నిజానికి అసలు చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళకి కూడా బ్లాగులంటే ఏమిటో తెలియదు. ఖాళీ సమయం లో మెయిల్ చూసుకుంటారంతే. తెలిసిన కొద్ది మందికి ఇంగ్లీష్ బ్లాగులు, టెక్నికల్ బ్లాగులు మాత్రమే తెలుసు. కనుక తెలియజేసే పని మనం తలకెత్తుకుంటే సువర్ణాధ్యాయం ముందుంది. కొంతమంది మేము ఫ్యాన్స్ ఫలానా బ్లాగరు ఈ-మెయిల్ ఇవ్వమని గొడవ చేస్తున్నారు. ఒక హాస్యబ్లాగుకి అభిమాన సంఘం పెడతా అని అడిగాడొక మితృడు. త్వరలో ఆర్కూట్ కమ్యూనిటి పెట్టినా పెడతాడు. కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందున. చిన్న చిన్న పొరపొచ్చాలు వస్తున్నాయి ప్రక్కన పెట్టి ఒక మంచి ప్రయోజనం కోసం పని చేద్దాం. భిన్నాభిప్రాయాలు ఉండి కూడా ఒక మంచి ప్రయోజనం కోసం కలిసి పని చెయ్యొచ్చు గా. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని రచిద్దాం. కొన్ని రోజులకి ఒక ఈనాడు, స్వాతి తెలుగు వారికి ఎంత సుపరిచయమో బ్లాగులు కూడా అలా కావాలని ఆశిస్తూ..
మీ
మురళీ.
మంచి ప్రయత్నం. ఓపికగా వారికి అలా links పంపించటం బాగుంది. తప్పక అలాగే కొనసాగించండి. నిజంగా మంచి కాలం ముందు ఉంది సందేహమే లేదు. అలాగే స్వాతి లాగా మన తెలుగు బ్లాగులు బహుళ ప్రాచుర్యంలోకి రావాలనే ఆశిస్తూ, మీ ఆశ నెరవేరాలనీ ..
Good job! I’m happy I’ve introduced some gems over here to the outside world. Yeah, bright days ahead.
నిజమే! మొదట్లో “ఏంటిబాబూ ఈ గొడవ?” అన్న కొందరు “ఇంట్రెస్టింగ్ కొత్త టపాలెమైనా వచ్చాయా?” అని అడుగుతున్నారు. ఇది మంచి పరిణామమే!
ఇక భిన్నాభిప్రాయాలూ, పొరపొచ్చాలూ అంటావా…అవి లేనిదెక్కడ? అవి ఉన్నంత మాత్రానా ఈ పురోగతి ఆగదు కదా!
“ఇలా ఒకతను లింకులు పంపుతున్నారు రా చూడండీ మేమ్ విస్త్రిస్తున్నాం” అని నిన్ననే మా స్నేహితులకు చెప్పం మురళి మీరు ఇలా రాసేసారు 🙂
Wonderful…… 🙂 🙂
మీ పద్ధతిని నేను కూడా పాటిస్తాను.
Hasini is hilarious. I have come across several dozens of such girls if not more. Good piece. Keep it up. By the way are you into only comic stories or into any seirous stuff. If you are serious please go to htt://corporatefraudswatch.blogspot.com/ to find some serious stuff and concern for our country.
Hey!!! astounding one! really I suggest ppl. suffering from Hypertension, hypotension to have a look@ ur blogs…..really am caught in madness to laugh…it’s laughing slautter! Make many such moves…..
Btw, may I offer one suggestion? Why don’t you put up Andhra poll mood in these?