అయ్యా,బాబూ,అమ్మా ఒక చిన్నమాట విని వ్యాఖ్యానించాల్సినది గా నా విన్నపం.
తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం అనే టపా మితృలు గుర్తించినట్టు లేరు. ఆంధ్రదేశం లో బ్లాగు అంటే ఏంటో తెలియని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు (నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి). తెలుగు బ్లాగులకి ఆంగ్లబ్లాగులంత విశేష ఆదరణ కావాలని మనం భావిస్తే జనాలకి అవగాహన కలిగే లా ఏదన్నా కార్యక్రమం చేయాలి. మనం రాష్ట్రం లో ఉన్న కాలేజి విధ్యార్ధులకి కూడా అవగాహన కలిగే లా చెయ్యగలిగితే ఇది మరో ఉద్యమమే అవుతుంది. దీనికి కాస్త సామాజిక భాద్యతని జోడించ గలిగితే మన భాష ని ఉద్దరించిన వాళ్ళం కాకపోయినా ఉడతా భక్తి ఏదో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మనకి మనమే చేసుకునే గొప్పసేవ ఆలోచించి వ్యాఖ్యానిస్తారని ఆశిస్తూ.
మురళీ.
all the best
start with from ur side
ఆలోచన మంచిదే. వీవెన్ గారుకూడా ఈ దిశగా ప్రయత్నాలు చేద్దామని బ్లాగర్స్ మీట్ లో చెప్పారు. వారితోకూడా చర్చించండి.