ఈ సారి బ్లాగ్విషయం “అల్లరే అల్లరి” లేదా “బకరా” నివేదిక ని తయారుచేసే భాద్యతని జ్యోతక్క నాకప్పగించారు. మీ అందరి సహకారంతో ఈ నివేదిక ని అందిస్తున్నా. అసలు నిజానికి మన బ్లాగర్లలో అబ్బాయిలంతా రాముడు మంచి బాలుడు, సుశీల నెమ్మదస్తురాలు అనే టైపు అనుకుంటా. అసలు ఈ అల్లరి అంటే ఏంటో ఆంగ్ల నిఘంటువుల్లో వెతికారేమోనని నా ఉద్దేశ్యం. అయినా నా పని చాలా సులువు చేసారు. మొత్తం గా పది టపాలు కూడా లేవు.
నివేదిక:
పాపం పసివాడి ని ఆటాడించిన జ్యోతి గారి అల్లరి కబుర్లు.
అల్లరా.. నేనా?? అంటూ తన ఊహలన్నీ ఊసులు గా మార్చి మనకి అందించిన పూర్ణిమ గారి అల్లరి ఙ్ఞాపకాలు.
నవ్వుల పువ్వులు పూచే బ్లాగువనం లో నేను స్కూలుకెందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే……..! అంటూ చెబుతున్న స్కూల్ దొంగ శ్రీ విద్య.
నేను చెప్పేది ఏమిటంటే… అసలు అల్లరే అల్లరి .. అని తన స్నేహితుడి ని ఆటపట్టించిన నిరంజన్ గారి 3 అల్లర్లు, 6 గొడవల కధ.
అల్లరా? అంత అదృష్టం కూడానా! అని తన మనసులో మాట చెప్పిన సుజాత గారు.
అమ్మో అల్లరా? ఈ మాట వింటే మా అమ్మ చీపురు తిరగేస్తుంది అంటూనే ఆడహనుమంతుల కిష్కింధకాండ ని సృష్టించిన కలగారు.
చివరిగా మీ అబ్బాయి చాలా మంచోడు అని నా గురించి అపోహపడ్డ మా అమ్మగారి స్నేహితులు.
ఇవండి అల్లరి కబుర్లు చదవని వారు చదవండి. చదివిన వాళ్ళు మరొక్కసారి చదివి ఆనందించండి.
ఈ సారి బ్లాగ్విషయం నన్ను సూచించమన్నారు. ప్రతిసారిలా హాస్యాన్ని కాక కాస్తంత సీరియన్ గా వుండాలని చెప్పారు. అందుకే మనందరికి ఇష్టమైన విషయం “తెలుగుతనం”.
తెలుగంటే పట్టుపరికిణీ వేసుకున్న 16 అణాల పడుచుపిల్ల.
తెలుగంటే గుబురుమామిడి తోటలో కోయిలమ్మ.
తెలుగంటే ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు.
తెలుగంటే నోరూరే గోంగూర పచ్చడి.
తెలుగంటే… అన్ని నేనే నా మీరూ చెబుతారా?
అవును పాశ్చాత్య సంస్కృతి లో కొట్టుకు చస్తున్న మన యువత కి తెలుగు అందాన్ని తెలియ జేసేలా మీ ఊహలు, అనుభవాలు, కోరికలు ఏవైనా. వాలుజడ మరదలి గురించి కావచ్చు, చిలకట్టు కట్టిన బావల గురించి కావచ్చు, సరదాల సంక్రాంతి కావొచ్చు, షడృచుల ఉగాది కావొచ్చు ఏదైనా తెలుగుతనం ఉట్టి పడే టపాల తోరణాలు అల్లండి. లేదా కాంక్రీటు వనాల లో కోయిలమ్మలా, ఈ సంకర సంస్కృతి తో ఇబ్బందిపడుతున్న మీకు ముద్దపప్పులో వెన్నపూసలా ఆనందాన్నిచ్చి, నేను తెలుగు వాడిననే గర్వాన్ని కలిగించిన అనుభావలెదురయ్యాయా? అయితే ఇంకేం మొదలు పెట్టండి.
ఇక సెలవు మరి. మీ టపాలకై ఎదురు చూస్తా.
మీ
మురళీ.
గమనిక: అల్లరి మీద వ్రాసిన టపాలు ఎవైనా ఈ నివేదిక లో లేకపోతే భవదీయుడ్ని క్షమించి వివరాలు ఇవ్వవలసినది గా మనవి.
Good Report!!
మంచి నివేదిక. నా అభినందనలు.
really a good report. great.
nice work.thank you
వావ్ మురళీ. మీలో ఇంత భావుకత్వం వుందని మీరు తెలుగుతనం గురించి అంత అందంగా చెప్పేదాకా నాకు తెలీనే తీలీదు.. అయితే ఈ సారి కొంచెం సీరియస్గా రాయాలన్న మాట..!
మురళి, గారు తెలుగు గురించి నిజంగా చాలా బా చెప్పారు.
చాలా బాఉంది.తేనెలా తీయగా..
హ్మ్మ్మ్..ఐతే ఈ సారి ఇదన్నమాట బ్లాగ్విషయం..మంచి విషయం.
సీరియస్ గా రాయాలన్నమాట….
baagundi
best wishes
పూర్ణిమ గారు, మహేష్ గారు, రవిగారు, క్రాంతి గారు, శ్రీ విద్యగారు, మీనాక్షి గారు, జాన్ హైడ్ గారు
ధన్యవాదాలు.
సీరియస్ గా అంటే ఇక్కడ మా ఉద్దేశ్యం హాస్యం ఉండకూడదని కాదు. వ్యంగ్యం, వెటకారం పాళ్ళు కొంచెం తగ్గించి విషయానికి ప్రాధాన్యత ఇవ్వమని. మీ సహజ శైలిని వదిలి పెట్టనక్కర్లేదు. మీ భావుకతకి, మీలో ఉన్న ఊహలకి రంగం లో దించండి.
good job.
good topic.thanks
gud report.