ముంగిలి » కవిత » బిచ్చగాళ్ళు

బిచ్చగాళ్ళు

బిచ్చగాళ్ళు వీళ్ళంతా బిచ్చగాళ్ళు
చితికిన బ్రతుకులు
చిరిగిన బట్టలు
ఇవే వారి జీవితాలు.

ప్రొద్దున్నే లేస్తారు
గుడి మెట్ల పై చేరతారు
భక్తులకై ఎదురు చూస్తారు.
వచ్చిన వారు కొందరు వీరిని చూడరు.
కొందరు చూసి చూడక పోతారు.
ఎవరో ఓ నాణెం వేస్తారు.
వారికోసమే ఈ ఎదురు చూపు.

ఎదురు చూపులు మలిసంధ్య ఆకాశం లా ఎరుపెక్కితే
చీకటి వేళ ఎప్పుడో ఇల్లు చేరతారు.
ఓట్లుతిన్న నాయకుల్లా కాక
ప్రతి నాణెనికి, దానానికి పుణ్యం ఇస్తారు.

ఎవరికి తెలుసు వీరి జీవితాలు
ఎవరికి కావాలి వీరి చిట్టాలు
ఙ్ఞాపకాల దొంతరలో

ప్రతి ఏడు పంటలేక
చేసిన అప్పులు తీర్చలేక
పొలం హలం అమ్మివేసి
జోలెపట్టిన రైతులు వీరు.

ఆడపిల్ల పెళ్ళి చేసి
అల్లుడు ముచ్చట తీర్చి
అప్పులపాలై అభిమానం చచ్చి
గత్యంతరం లేని మాజీ గుమస్తాలు వీరు.

తాతలనాటి పరువుకోసం
ఉన్నదంతా ఖర్చుచేసి
గొప్పల డబ్బాలు కొట్టి
దిగజారిన జమిందారులు వీరు.

దేవుడిచ్చిన అవిటితనం
తాతలిచ్చిన పేదరికం
వారసత్వంగా వచ్చి
పనులు చేయలేక
ఇంటివారికి భారం కాక
ఇటువచ్చిన వికలాంగులు వీరు.

బిచ్చగాళ్ళు వీళ్ళంతా బిచ్చగాళ్ళు
చితికిన బ్రతుకులు
చిరిగిన బట్టలు
ఇవే వారి జీవితాలు.

ప్రకటనలు

11 thoughts on “బిచ్చగాళ్ళు

  1. కవిత చాలా బాగుంది. గుడ్ కంపోసిషను.

    మీ కవితలో
    రైతులు, గుమస్తాలు అంటూ డైరెక్ట్ గా చెప్పకుండా, రైతులెమో వీరు, గుమస్తాలెమో వీరు అంటూ సూచ్యప్రాయంగా చెపితే ఇంకొంచెం ఆర్ధ్రత పలికేదేమో అనిపిస్తుంది. ఆలోచించండి.

    బొల్లోజు బాబా

  2. బాబా గారు,
    మీరు చెప్పినది కరక్టే అనిపించింది. ఒకసారి పూర్తిగా చూసి మార్చేప్రయత్నం చేస్తా?

    మీనూ,
    ప్రేరణ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈ కవిత నేను 2000 లో ఇంటర్ లో ఉండగా రాసింది. అప్పుడు ప్రతీ గురువారం సాయిబాబా గుడి కి వెళ్ళేవాడ్ని. అక్కడ కొంత మంది బిచ్చగాళ్ళని చూసినప్పుడు వచ్చిన కవిత ఇది.

    ప్రతాప్ గారు,
    నెనర్లు. నా ప్రతి టపాని తప్పక చూసి వ్యాఖ్యానిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.

  3. కొందరు కనుగుడ్త్డెనా తెరవని పసికందులను చూపి, వారి పోషణ పేరుతో ‘భిక్షాటన వ్యాపారం’ చేస్తుండగా మరికొందరు మహిళలు చింకిగుడ్డలను ఉపయోగించి వాటిని శిశువుల్లాగా భ్రమింపజేసి, పసిపిల్లకు పాలు లేవు ధర్మం చేయండంటూ ప్రజలను మోసగిస్తున్నారు! పిల్లలను చూపి యాచన చేస్తున్న వారు వారిని తల్లిదండ్రుల నుంచి రోజుకు రూ.150 నుంచి రూ.200 చొప్పున ‘అద్దె’కు తెచ్చుకుంటున్నారు. మధ్యలో లేచి ఏడ్చి, తమ ఆర్జనకు ఆటంకం కాగూడదన్న ఉద్దేశంతో ముక్కుపచ్చలారని చిన్నారులకు నల్లమందు వంటి మత్తుమందులను ఇచ్చి, వారు నిద్ర లేవకుండా చేస్తున్నారు.శిశువులతో భిక్షాటన చేసే వారు తారసపడితే వెంటనే 1098 (ఛైల్డ్‌ లైన్‌)కు ఫోన్‌ చేస్తే ఆ చిన్నారులను రక్షించి వారికి అవసరమైన సంరక్షణ కల్పిస్తారు.మన రాష్ట్రంలో చైల్డ్ లైన్లు హైదరాబాద్,విజయవాడ,విశాఖపట్నం,ఏలూరు లలో ఉన్నాయి.ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనే స్వచ్చందసంస్థద్వారా కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీటిని నిర్వహిస్తోంది.దేశ రాజధానిలో యాచకులెవరూ కనిపించకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 1959నాటి బాంబే భిక్షాటన నిషేధ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయనున్నారు. యాచకులు కనిపించిన వెంటనే అక్కడికక్కడే విచారించి శిక్షలు విధించేందుకు సంచార న్యాయస్థానాలను ప్రారంభించారు. పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీల ప్రాంగణాల్లో యాచకులను అనుమతించవద్దని ఆయా మత పెద్దలను సంక్షేమ శాఖ అధికారులు కోరారు. ఢిల్లీని యాచకులు లేని నగరంగా మార్చాలని హైకోర్టు సూచించింది.బహిరంగ ప్రదేశాల్లో జరిగే భిక్షాటనను ప్రభుత్వం నేరంగా ప్రకటించింది. జనసమ్మర్థమున్న ప్రాంతాల్లో ఇకపై భిక్షాటన చేస్తే అరెస్టు చేయాలని నిర్ణయించింది. యాచకులు (బెగ్గర్స్‌) లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో 1977 ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్‌ కింద సాంఘిక సంక్షేమశాఖ ఈ ఉత్తర్వులిచ్చింది.జనాలు ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారెంటు లేకుండా అరెస్టు చేస్తారు. తరువాత 24 గంటల్లోగా కోర్టుకు హాజరు పరుస్తారు. యాచకుడు తాను ఎందుకు భిక్షాటన చేస్తున్నదీ, అంగవైకల్యం ఉన్నదీ లేనిదీ, అన్నీ కోర్టుకు వివరించుకోవాల్సి ఉంటుంది.అనంతరం కోర్టు ఆదేశాల మేరకు వారిని ప్రత్యేక హోమ్‌లకు తరలించి వసతులు కల్పించాలి.అరెస్టు చేసిన వారికి పునరావాసం లేదా ఆశ్రయం కల్పించడం కోసం సాంఘిక సంక్షేమశాఖ నుంచి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి.ఆశ్రయం కల్పిస్తున్న సంస్థల్లో చిన్న పిల్లలకైతే చదువు, పెద్దవారికైతే వృత్తిపరమైన శిక్షణ ఇచ్చేందుకు కూడా వసతులు కల్పించాలి. ఎవరైనా యాచక వృత్తి చేస్తూ పట్టుబడి, మార్పు చెంది తిరిగి ఆ వృత్తి చేయకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ముందుకొస్తే, కోర్టు అనుమతి ద్వారా ఆ వ్యక్తిని విడుదల చేయవచ్చు.యాచక వృత్తిని నిరోధించడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s