స్నేహమా రాధిక గారి పాట చదివిన తరువాత నేను కూడా పాటల టపా పెట్టాలని అనుకున్నా. మా కాలేజి లో కొంత మంది స్నేహితులతో కలిసి నేను కొన్ని పాటలు వ్రాసి రికార్డింగ్ కూడా చేసాం. కానీ ఆడియో ఫైలు అట్టాచ్ చెయ్యలేకపోతున్నా. లిరిక్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నా. బ్లాగుమితృలెవరైనా పాటలు అట్టాచ్ చెయ్యటం ఎలాగో చెబితే ఆడియో ఫైల్స్ కూడా అందిస్తా. స్వర మైత్రి, సంగీత ఙ్ఞానం ఉన్నవాళ్ళు దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఇవి గాలిపాటలు, అచ్చంగా మన జానపదాలలా. ఎందుకంటే ఇవి అందమయిన ఊహలలోంచి వచ్చినవే తప్ప, మాకు స్వర ఙ్ఞానం లేదు. అలానే శృతులు,యతులు తెలియవు
సందర్భం:
ఒకమ్మాయి ఒక అబ్బాయి కి కనిపించకుండా, అతని నే అనుసరిస్తూ చిన్న చిన్న బహుమతులు పంపిస్తూ ఉంటుంది. ప్రతిసరీ బహుమతిలో ఒక ఉత్తరం పెడుతుంది. ఆ ఉత్తరాలు చదివి ఇష్టపడి ఆమె ఎవరో తెలుసుకోవాలనే తపన పడే అబ్బాయి ఊహలు.
నీడల్లె నా వెంట ఉన్నా
నిను పోల్చుకోలేదు ప్రతి సారి
నువ్విప్పుడేచోట ఉన్నా
కనిపించవా నాకు ఓ సారి
||నీడల్లె||
||2|| నవ్వుతూ కవ్విస్తావు ఉత్తరం పంపిస్తావు
మెల్లగా మాయ చేసి ఇంతలో మిస్సవుతావు ||2||
ఆణువణువు నే వెతుకుతున్నా
నె చేరలేనా నీ దారి
||నీడల్లె||
||2|| హంసల్ని రప్పిస్తాను వెతికెందుకొప్పిస్తాను
నిన్ను చేరె దాక ఊరూరు పంపిస్తాను ||2||
నువ్వెంత తప్పించుకున్నా
నను దాటి పోలేవు ఈ సారి
సంధర్భం: ఎవరో తెలియని ఓ అబ్బాయి అల్లరి పనులు, ఇతరులకి చేసే సహాయాలు చూసి ప్రేమించిన అమ్మాయి ఊహలు.
కోయిలమ్మా కోయిలమ్మా
ఇంతలోనే ఎంత ప్రేమ
ఎవరో తెలియకుండా మనసే అడగకుండా
తననే వలచెనంట ఇది చెప్పలేని వింత
||కోయిలమ్మా||
తనతో చెప్పాలి మనసే విప్పాలి.
ఇకపై బిడియాన్ని ఆపాలి.
కలలే ఆగాలి నిజమై రావాలి.
జతగా అతగాడే కావాలి.
||కోయిలమ్మా||
మల్లెలనే తెచ్చి వెన్నెల లో పరిచి
తనకై నే ఎదురుచూస్తున్నా.
ఎక్కడ నే ఉన్నా ఏ పని చేస్తున్నా
తనధ్యాస లోనే బ్రతుకుతున్నా.
||కోయిలమ్మా||
సంధర్భం: ఇది షరామాములే ప్రేమలో ఓడిపోయిన ఓ అబ్బాయి కంటతడి..
ప్రేమనే ప్రేమిస్తే ఓటమే ప్రతిసారి
ప్రేమగా మనసిస్తే భాధలే మిగిలేవి
మనసుకోరే గమ్యం చేరనీడే దైవం
చెలిమి కోరే హృదయం అందుకోదే విజయం
||ప్రేమనే||
చీకట్లు కమ్ముకున్నా నిదుర నను చేరరాదు
కనులెంత మూసి ఉన్నా నీ రూపు మాసిపోదు
వెంటపడి వేదిస్తూనే జంట నే రానంటుంది
కంటతడి పెడుతూ ఉంటే కొంటేగా నవ్వుతుంది.
||ప్రేమనే||
ఏంటి ఈ బోడి పాటలు మేము చదవాలా అనుకొన్నవారికి శతకోటి క్షమాపణలు. సర్లే చావు పో అనుకున్న వారికి నెనర్లు.
#1 is pretty decent
# 2& 3 are rather mediocre.
Not to discourage you, but hope you will write better stuff.
అయ్యా …జాణపదాలు కాదు …జానపదాలు. అక్కడ అర్థమే మారింది…కాస్త సరిచేయగలరు…. మీ పాట బావుంది…
muuDu paaTalu caalaa baagunnaayandi.3va paaTa baagaa nachchindi.keep it up
హేఁవిటో, బ్లాగుల్లో భగ్న ప్రేమికుల్ ఎక్కువైపోతున్నారీ మధ్య. యాడ జూసినా విరహగేయాలే!!
బాగున్నాయ౦డి.కానీ ఏమి అనుకోక౦డి.అన్నీ ప్రేమ మీదే రాసారు.అదే బాగా లేదు.అలా అని ప్రేమని తక్కువ చేయడ౦ లేదు.మిగతావి కూడా గొప్పవే అని చెప్పాలని నా భావన.మీరు వాటి మీద కూడా ఇ౦తే గొప్పగా రాయగలరు.రాస్తారు అని ఆశిస్తూ … మీ క్రా౦తి(pls don’t mind).
Waiting for the audio attachments.
బ్లాగుల్లో మీకు లాంటి వారు వ్రాసే ప్రేమ గీతాలు చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి అసూయ వేస్తూంటుంది.
నెనూ నా బ్లాగులో ఓ ప్రేమ గీతాన్నుంచితే, మీరు ప్రేమగీతాలు కూడా వ్రాస్తారా అని ఎవరో బ్లాగరి ఎద్దేవా చేసారు. ప్చ్ ఏం చేస్తాం.
పాటలు చాలా చాలా బాగున్నాయి.
గొ అహెడ్
బొల్లోజు బాబా
బాబా గారు, అబ్రకదబ్ర గారు, కొత్తపాళీ గారు,క్రాంతి గారు,రాధిక గారు,విజయ క్రాంతి గారు
నెనర్లు.
అరుణ్ గారు,
ఆడియో అట్టాచ్ చెయ్యటం కుదరటం లేదండి.
మురళీ,
మంచి ప్రయత్నం. కొన్ని పదాల అమరిక అంత బాలేదు. వాటిని కొద్దిగా మారిస్తే సూపరు.
నేను కూడా పరుగులో ఒక పాటకి రాసేదానికి ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా పాట సగం వరకే రాయగలిగాను. అప్పుడు అర్ధం అయింది పాట రాయడం ఎంత కష్టమో! మీరు ఎంత అలవోకగా రాసేస్తున్నారు. గుడ్.
ప్రతాప్ గారు,
నెనర్లు.