పగిలిన గాజు ముక్కల్లో నిన్నటి నిజాన్ని వెతుకుతున్నా,
కానీ పగిలింది అద్దం కాదు నేను నమ్మిన నిజమే.
* * * * * * * * *
నేను నిన్నే చూస్తున్నా,
నువ్వప్పుడు వెన్నెలని చూస్తున్నావు.
* * * * * * * * *
కలల అలలు నిజమనే తీరాన్ని తాకితే,
మనలో మరో కలాం పుడతాడు.
* * * * * * * * *
నీ కనుకొనల మొనలు తాకి
నా మనస్సుకయ్యిందో గాయం.
దాని భాద నాకో జీవిత కాలం.
* * * * * * * * *
అనంతమైన చీకటి లో ఓ చిరు దివ్వెను వెలిగించాను.
చూడాలి గెలుపు చీకటిదో? చిరు దివ్వెదో?
* * * * * * * * *
నీటి లోని చేప ఎరవైపే వెలుతుంది.
మనిషి చీకటి లోకి వెలుతున్నట్టే.
చాల బాగున్నాయి. చిన్న చిన్న పదాల్లోనే మంచి భావాలు పలికించారు.
Waaaaaaaav nice touching keep going
very nice quotes..
Thanks Murali for comments and forwarding to ur frends. I feel really flattered 🙂
@ Vijaymohan, Kranthi, Srividya
హమ్మయ్య. శీర్షికనామం సార్ధకం చేసానంటారేమోనని భయపడ్డా.
బిట్లు బిట్లు గా చదువుకుంటే చాలా చాలా మంచి మంచి ఊహలు. కలిపి కంటిన్యుయస్ గా చదివితే కొంచెం గందరగోళం. పేరాగ్రాఫు బ్రేక్ ఇచ్చి మంచి పని చేసారు.
ఒక్కొక్క దాన్ని మూడేసి లైన్లగా విడదీసినట్లయితే ఒక్కో హైకూ తయారయ్యాది. గమనించారా?
మీలో మంచి భావుకత, తాత్వికతా ఉంది. ఉదా: మనసు బాధో జీవితకాలం అనటం, గెలుపు చీకటిదో? చిరు దివ్వెదో? అనటం గొప్పభావనలు.
అభినందనలతో
బొల్లోజు బాబా
బొల్లోజు బాబాగారికి,
హైకూలు వ్రాయాలనే ప్రయత్నమే. అందుకనే విడిగా వ్రాసాను.
పిచ్చిరాతల్లో ఎన్ని ఊహలో
ఆ ఊహల్లో ఎన్ని లోతులో
ఆ లోతుల్లో ఎన్ని గాధలో
ఆ గాధల్లో ఎన్ని బాధలో
ఆ బాధల్లో ఎన్ని ఆశలో
కనుకొనల మొనలు తాకి, superb. నాకూ అలాంటిచూపుల గాయం తగిలింది.. చాలా బావుంది ఈ కవిత..keep it up..
పింగుబ్యాకు: బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం