అవి నేను ఉద్యోగంలో చేరిన తొలి రోజులు. మాకు ఒక పెద్ద రూం లో ట్రైనింగ్ క్లాసులు జరిగేవి. ఖాళీ గా ఉన్నప్పుడు అందరం సరదాగ తెలుగు పాటలు పాడుకొనేవాల్లం. లేదా కొందరు ఔత్సాహికులు కవితలు రాస్తే చదివి పండగ చేసుకునేవాల్లం. ఓ రోజు ఉన్నట్టుండి మా కుర్రాళ్ళకి ఆవేశం వచ్చింది. అందరూ కలిసి గుంపుగా సామూహిక సాహిత్య ద్రోహానికి పూనుకున్నారు. గుండెకి గుబులు పుట్టేలా, బండలు బ్రద్దలయ్యేలా కలాల తో కలకలం సృష్టించారు. ఆ కవితా సునామీ మీ కోసం.
హెచ్చరిక: ఈ కవితలు చదివిన తరువాత పాటకులకు కలిగే అవస్థలకు నేను భాద్యుడ్ని కాను.
డబ్బాలొ….
డబ్బాలో రాళ్ళు గల గలా…
నువ్వు మట్లాడుతుంటె నాతో అలా అలా….
నాకనిపిస్తోంది రెంటి మద్య తేడా లెనట్టులా…
నేనిలా నువ్వలా….
నువ్వులేక నేను ఎలా…
కొట్టుకు చస్తున్నా గిల గిలా …
ఒడ్డున పడ్డ ఒక చేపలా….
వదిలించు కోవడమెలా..
ఓ పిల్లా…….
సరదగా నీపై వేసాను వల…
నువ్వు తగిలావు ఒక చేపలా…
పట్టుకున్నావు నన్ను ఒక జలగ లా..
నిన్నిప్పుడు వదిలించుకొవడం ఎలా.. ఎలా..
ఓ కన్నా…
ఓ కన్నా …….
తాగొద్దని అన్నా….
తాగాలన్న నీ తపన చూసి చెపుతున్నా ….
రెండు పెగ్గులేసి పడుకో చటుక్కునా….
ఇంకొక్క పెగ్గన్నావంటె నిన్ను నరకనా….
కచ్చగా కవిత
కచ్చగా రాసా నేనొక కవిత
అది కసి గా తీసుకొచ్చి చదువుతా
వినకపొతే మీ అందర్ని నరుకుతా
అది విని బతికితె మళ్ళీ చదువుతా..
మళ్ళీ చదువుతా..మళ్ళీ చదువుతా..
నా మీద కోపగించక పోతే మళ్ళీ కలుద్దాం.
పై కవితల్నన్నీ మన సినిమా వాళ్ళకి పాటలకింద అమ్మేసుకోవచ్చు. హైదరాబాద్ లోనే ఉంటే ప్రయత్నించండి…..
మహేష్ గారు, ఇప్పటికే తెలుగు సినిమా పాటలు వినలేక పోతున్నాం. ఆ పాపం లో నన్నూ భాగం పంచుకోమంటారా?
మురళీ నిజం చెప్పు….. ఇవన్నీ నీ కవితలే అనిపిస్తోంది నాకు. ఇంత పెద్ద జోకులు వేరే ఎవరూ వెయ్యలేరు అని నా అభిప్రాయం
హ హ హ …ఇలాంటి ‘కపి’తా-రత్నాలు ఇప్పటికీ రాస్తాను నేను – నాకు తెలిసిన భాషలన్నిటిలో.
అప్పుడప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ వేసి ఆ పోస్టులో ఇలాంటి కపితల పోటీలు నిర్వహిస్తాం కూడా.