ఎండమావి లో నీటికై వెతికి
గుండెబావి లో నీటిని కంటి చెమ్మ గా కోల్పోయిన వెర్రివాడ్ని నేను.
నిశీధి లో కాంతిని పంచుతానంటూ
గమ్యాన్ని వెతుకుతానంటూ గగ్గోలు పెట్టి
వెలుగు ను కోల్పొయిన చిరుదివ్వెను నేను
ఉన్నత శిఖరాలు అధిరోహించాలాంటూ
ఆరాటం తో ఆశతో అడుగులు వేస్తూ
అలసిపోయి అదుపు తప్పి అధఃపాతాలానికి
పడిపోయిన ఆరొహకుడ్ని నేను
అయినా పరిగెడుతున్నా, ప్రయాణిస్తున్నా
ప్రయత్నిస్తున్నా, ప్రయాస పడుతున్నా
నా దృష్టి దాష్ఠికాన్ని చూడలేని దూరాలకు పోతుంది.
నా అడుగు ఆవేశం తో అనంత దూరాలకు సాగిపోతుంది.
ఎందుకంటే,
నేను శరీరం క్రుళ్ళిన శవాల మధ్య ఉండగలను.
కాని, మనసు క్రుళ్ళిన మనుషుల మధ్య కాదు.
బావుంది. మొదటి తొమ్మిది పాదాలూ చదివి ఏదో ఆశావహ దృక్పథానికి దారితీసే కవితేమో అనుకున్నా. నా అంచనాలన్నీ తారుమారు చేసేలా ఉంది ముగింపు.
అది అలా ఉంచితే, పదాలు కొంచెం పొదుపుగా వాడి ఉండాల్సింది, ఇంకా అందం వచ్చేది. ఉదాహరణకి…
క్రుళ్ళిన శరీరాల మధ్య ఉండగలను
క్రుళ్ళిన మనసుల మధ్య కాదు
geevitam oka parugu pandem
dani lo gelavadame mana lakshyam
kani gelavadame geevitam kadu
gelupu tone vijayam radu
otamini odinchi
gelupini gelavalani
apude life is beautiful………..
overall this is good….but what Mr. Raghava said was right..u could have gone past the last two rows….
how can write this in Telugu? I am looking to free my arms in Telugu….tell em what to install and where to get the downloads….
tc bbye…
plz. send it thru mail account…
“నా అంచనాలన్నీ తారుమారు చేసేలా ఉంది ముగింపు”same feeling.baga raastunnaaru.
పరుగు ఇప్పుడే గా మొదలయ్యింది. మీ సూచనలను, సలహాలను స్వీకరిస్తూ మెరుగు పరుచుకుంటాను. అందరికీ ధన్యవాదాలు.
ఎత్తుగడ అదిరింది.
లోతైన భావాలతో, చాలా బ్రెవిటీ తో సాగింది.
చివరలో చెప్పదలచుకొన్న విషయం కవితను చప్పగా ముగించేలా చేసాయి. కవినో ఎస్కేపిష్టుగా మిగిల్చాయి.
ఆఖరు రెండు లైనులు లేకపోయిన కవిత అర్ధం కొత్తగా ఉంటుంది. గమనించండి.
బొల్లోజు బాబా
బొల్లోజు బాబాగారికి, ధన్యవాదాలు. నిజానికి మీ వ్యాఖ్యల కోసం ఎద్చూస్తున్నా. మీరు చేసిన సూచన గురించి ఆలోచిస్తున్నా.