ముంగిలి » Mega Star » చిరు ఆశ

చిరు ఆశ

“చిరు”ఆశ అంటే కొన్ని కోట్ల అభిమానుల ఆశ.
 
ఎవరో వస్తారని ఏదొ చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ఆంధ్ర ప్రజలకు చిరు రాజకీయ రంగ ప్రవేశం నిజంగా ఓ అల్లాదిన్ అద్బుత దీపమే. ఈ చిరు ఆశ వెనుక ఎన్నో మెగా ఆశలు ఉన్నాయి. మన అంజనీ పుత్రుడు సినిమాల్లొ హిమాలయాల నుండి సంజీవని, ఆకాశం నుండి గంగని తెచ్చాడు. అలాగే ఈ జగదేక వీరుడు మనకి ఎదో తెస్తాడని ప్రజల ఆశ. ముఠామేస్త్రి గా ఉన్నప్పుడే ప్రజలకి అవసరమైతే వస్తా అని చూచాయ గా చెప్పిన చిరు ఇంద్ర, ఠాగోర్, స్టాలిన్ ల తో ప్లాట్ ఫార్మ్ ఖాయం చేసాడు.ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులలో అందరూ దోచుకొనే వారే తరాల కొద్ది దాచు కొనే వారే.అత్త సొమ్ము అల్లుడి దానం అని ప్రజల సొమ్ము బంధువులకి బామ్మరుదులకి ధార పోసే వారే. పనికి ఆహారం తో మొత్తం కైంకర్యం చేసారని రాజన్న అంటే, జలయగ్నం ధన యగ్నమని చంద్రన్న అంటాడు.మొత్తానికి లెక్కల మాస్టారి మొట్టికాయల తర్వాత తెలుగు మాస్టారి లెంపకయల్లా వుంది అంధ్ర పరిస్థితి. ఇప్పుడు క్లీన్ కాండక్ట్  సర్టిఫికేట్ తో ఛిరు వస్తా అంటే మేము వద్దంటామా ? అని ప్రజలు       
‘శంకర్ దాదా జిందాబాద్ హూ హా హూ హా’ అంటూ జేజేలు కొడతారు. ఇన్నేళ్ళు గా తమ వోట్లన్ని నోట్లకి, క్వార్టర్లకి వేసిన జనం ఈ మొగల్తూర్ మగ మహారాజు కి వేసి నీరాజనాలు పలుకుతారు.                             

7 thoughts on “చిరు ఆశ

 1. నిజానికి నేను అభిమాని ని కాను. బ్లాగు మొదలు పెట్టెప్పుదు మంచి టాపిక్ కావాలి గా. ఈ రోజున మన రాష్ట్రం లో ఇంతకంటే పెద్ద టాపిక్ ఏముంది?

 2. Hai man….this is too good to be true….content is not that impressive, but commendable …Please bring about some major changes, ie,. invoke some burning topics ….

  Is the post of governor is mandatory or not?

  Should the Govt. of India allow the Indian cricket team to travel Pakistan?

  What could be the role of IAS and IPS, the age-old machinery of Federal Govt. in these pro-govt. days?

  If at all glamour makes entry into politics what should be the agenda?

  etc,. etc,. questions and you can evoke the Indians response…..

 3. how can you surely say that chiru will not become a Rajjana or like a Chandranna….
  is there any idle person in politics who will be as white as forever…..
  Chiru MIGHT BE good today, but once entered into politics, how far it can be believable that he will do miracles to AP???? What is the evidence that he will serve AP to the extent that all people will be beneficiated??

  It is not the politics what he did so far in Cinema Industry suppressing mana stars and actors

 4. తనదాకా వస్తే గాని తెలీదనే దాన్ని రుజువు చేసి
  తొమ్మిది నెలల అభ్యాసంతోనూ ఎందుకొస్తున్నాను అని దస్త్రం చూడక విడమరచలేక
  పురిటి నొప్పులలోనే బంధుగణ సమర్థనతో
  సమస్యలపై తప్పటడుగులతో నడుస్తున్న నాయకుడిని
  అందరివాడని ఆంద్రులంతా ఆదరిస్తారా..?
  ఒక చిరు సినీ అభిమానిగా నాకు సందెహమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s