ఉగ్రవాదం జిందాబాద్

జులై 14, 2011 at 12:57 సాయంత్రము 9 వ్యాఖ్యలు

ఉగ్రవాదం జిందాబాద్

ఉగ్రవాదం జిందాబాద్

హిమోగ్లోబిన్ అడుగంటిన రక్తం
రోడ్ల మీద ఎర్రగా మెరిసింది
కండలేని దేహం
ముక్కలుగా నింగికెగసింది
కాల్షియం కరువయిన
ఎముకలు గుండగా మారాయి
కారిడార్లో మాంసపు ముద్దలతో
సైలెన్స్ అని అరుస్తున్న ఆసుపత్రులు
వెర్రిగా చిందులేస్తూ
వికటాట్టహాసం చేస్తూ మృత్యువు

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

మంటలుపెట్టే మతాలు
కుమ్ములాడే కులాలు
నిలువునా దోచుకునే రాజకీయాలు
నడ్డివిరిచే ధరలు

రౌడీలు,గూండాలు
కబ్జాలు,ఖూనీలు
కూతురి వెంటపడే పోకిరోళ్ళు
ఇళ్ళు లూటీ చేసే దొంగ నాయాళ్ళు
ఇక్కడే ఇన్నుండగా
ఎక్కడినుండో బాంబులు మోసుకొచ్చారా అంటూ

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

ఒంటెద్దు సంసారాల నుండి,ఉద్యోగాల నుండి
క్యూలు నిండిన రేషన్ల నుండి,సినిమా టిక్కెట్ల నుండి
కట్నాల నుండి, బీటు కానిస్టేబుల్ లంచాల నుండి
ఇన్సూరెన్సు నుండి,కేబుల్ కనెక్షన్ల నుండి
షుగర్ మందుల నుండి, వాకింగుల నుండి
కుర్లాన్ పరుపులో కలల నుండి,ఆశల నుండి,అలసట నుండి
ఉగ్రవాద బాంబులు ఇచ్చిన
మోక్షానికి సంబరపడుతూ
కర్కశత్వపు అమాయకత్వానికి
జాలితో కృతజ్ఞతలు చెబుతూ

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

Entry filed under: కవిత, కవిత్వం, తెలుగు, వ్యంగ్యం. Tags: , , , , , , , , , , .

విజన్ 2040 తేట తేట తెలుగు

అభిప్రాయములు Add your own

  • 1. వేణూశ్రీకాంత్  |  1:05 సాయంత్రము వద్ద జులై 14, 2011

    Hmmmm బాగా రాశారు…

    జవాబు
  • 2. Kranthi Kumar Malineni  |  2:12 సాయంత్రము వద్ద జులై 14, 2011

    good one murali :-)

    జవాబు
  • 3. Venkat asapu  |  10:22 సాయంత్రము వద్ద జులై 14, 2011

    Baagundi..

    జవాబు
  • 4. శ్రీనివాస్‌  |  11:52 ఏ ఎమ్ వద్ద జులై 15, 2011

    కదిలించింది.

    జవాబు
  • 5. shoutlarge  |  1:35 సాయంత్రము వద్ద జులై 15, 2011

    Nice..the best of urs.. :) used SMS lingo only to reiterate that we don’t care any such as we are software people :D

    జవాబు
  • 6. saamaanyudu  |  6:39 ఏ ఎమ్ వద్ద జులై 23, 2011

    ఆర్థ్రతతో నిండివున్న ఆగ్రహాన్ని బాగా చెప్పారు మురళీ….

    జవాబు
  • 7. padmakala  |  12:35 సాయంత్రము వద్ద జులై 24, 2011

    extraordinary ……………………….

    జవాబు
  • 8. Madhumanasam  |  9:19 ఏ ఎమ్ వద్ద జులై 29, 2011

    Loved it. ఈ దుర్మార్గం మీద ఎన్ని వేల కవితలు రాసినా దుఖఃము తీరదు.

    జవాబు
  • 9. Hemanth  |  7:51 సాయంత్రము వద్ద జులై 30, 2011

    annititho paate ivi kuda sagatu manishiki alavataipoyinattuga – oka vyangya rachanala.. chala bagundi sir

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

  • 36,617 దాటాను.

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape

Follow

Get every new post delivered to your Inbox.