పితృదేవోభవ
జూన్ 20, 2011 at 5:52 ఏ ఎమ్ 8 వ్యాఖ్యలు
హిమాలయం కరగటం చూసా
కరిగి వాకిట్లో సెలయేరుగా పారటం చూసా
మౌనం వీడి కేరింతలు కొట్టడం చూసా
నాతో కలిపి నట్టింట్లో కుప్పిగంతులు వెయ్యటం చూసా
నిలువెత్తుగా నిలబడ్డ గాంభీర్యం చూసా
తొణకని వ్యక్తిత్వం చూసా
చుక్కలనంటే ఆశయాన్ని చూసా
ఆదుకుంటా అనే అభయం చూసా
శిఖరం వరకూ మలచిన దారిని చూసా
దారి పక్కన ముళ్ళ పై రక్తపు మరకలు చూసా
కొండెక్కిన వెన్నెల చూసా
ఇవన్నీ నాకే అన్న సంఙ్ఞని చూసా
నాన్నా నువ్వే నా తొలిగురువు
నువ్వే నా మలిగురువు
నీ మౌనం,జీవనం ఒక పాఠం
నువ్వు నడిచే ఙ్ఞానం
ఎందరు వేలు పట్టి దిద్దించినా
ఎన్ని వేల పుస్తకాలు చదివినా
బ్రతకటం నేర్పేది మాత్రం
నీ వేలు పట్టి నడిచిన దారే.
ఈ దేహం నీది
ఈ రక్తం నీది
ఈ జీవితం నీది
నేను కేవలం నీ నీడని.
Entry filed under: కవిత, కవిత్వం, తెలుగు. Tags: కవిత్వం, తెలుగు, తెలుగు కవిత, తెలుగు కవిత్వం, kavita, kavitvam, poetry, telugu, telugu poetry.
అభిప్రాయములు Add your own
ప్రత్యుత్తరమిమ్ము
Trackback this post | Subscribe to the comments via RSS Feed







1. Avineni Bhaskar / అవినేని భాస్కర్ | 6:25 ఏ ఎమ్ వద్ద జూన్ 20, 2011
హృదయంగా ఉంది నీ కవిత.
2. John Hyde | 9:07 ఏ ఎమ్ వద్ద జూన్ 20, 2011
clap…. clap
baagundi
3. పుట్టపర్తి అనూరాధ | 9:13 ఏ ఎమ్ వద్ద జూన్ 20, 2011
ఎంతబాగా రాసారండీ..హాట్సాఫ్..
4. వేణూశ్రీకాంత్ | 9:22 ఏ ఎమ్ వద్ద జూన్ 20, 2011
అద్భుతంగా ఉంది మురళి గారు చాలా బాగా రాశారు…
5. Pranav Ainavolu | 9:43 ఏ ఎమ్ వద్ద జూన్ 20, 2011
చాలా బాగుంది మురళి గారు
6. శ్రీనివాస్ | 12:37 సాయంత్రము వద్ద జూన్ 22, 2011
చాలా బావుంది. మొదటి నాలుగు లైన్లు మరీ ఆకట్టుకున్నాయి.
7. sphoorty1 | 2:23 సాయంత్రము వద్ద జూన్ 28, 2011
“అద్భుతం అనే పదం చిన్నగా (క)అనిపించడం ఇప్పుడే అనుభవమయ్యింది. నిజంగా “నాన్నారూ” అనే పదం లో ఉన్న (ఉన్న)తత్త్వాన్ని తొలి నాలుగు పంక్తుల్లో పదాలుగా మలచిన తీరు ….మాటలు వెతుక్కుంటున్నా….”
8. umamaheswararao | 3:01 సాయంత్రము వద్ద జులై 16, 2011
chala baga rasaru murali garu.meeru ila enno manchi kavithalu rastarani asistunnamu.thanking you