ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో

ఏప్రియల్ 10, 2011 at 9:16 ఏ ఎమ్ 8 వ్యాఖ్యలు


తోడురాని పయనం

తోడురాని పయనం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

ఏడుస్తూ వస్తాం
ఏడిపిస్తూ పోతాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

కూడంటాం గూడంటాం
గుడ్డంటాం దుడ్డాంటాం
ఈడంటాం జోడంటాం
తాడంటాం బిడ్డంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నాదంటాం నీదంటాం
జాతంటాం మతమంటాం
పదవంటాం మదువంటాం
స్థాయంటాం స్థోమతంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఎదురుబొంగు పాడె మీద
కట్టెల మంటలోకి
ఆరడుగుల గొయ్యిలోకి
ఖాలీ చెయ్యితోటి

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నీది లేదు నాది లేదు
గుప్పెడు బూడిద
మందిలేదు మతం లేదు
ఒంటరి బాట

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఉసురు పోయాక ఒట్టి ఊసే నువ్వు
మడుసుల మతిలో మిగిలే కతే నువ్వు

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

Entry filed under: కవిత, తెలుగు, పాటలు. Tags: , , , , , , , , , .

అందరికీ మొదటి అమ్మ పెళ్ళి-ఒక దృక్కోణం

అభిప్రాయములు Add your own

  • 1. manju  |  12:03 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    nijame,,,bagundi mee kavita

    జవాబు
  • 2. suneeth  |  12:09 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    super ra

    జవాబు
  • 3. Ramanaidu  |  12:09 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    well told the philosophy of life

    జవాబు
  • 4. praveena  |  12:51 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    chala chala bagundi..

    జవాబు
  • 5. swapna  |  2:03 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    chala bavundi

    జవాబు
  • 6. Avineni Bhaskar / అవినేని భాస్కర్  |  5:29 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    ఈ కవితలోని ప్రతి పంక్తీ బాగుంది. అందరికీ తెలిసినా వాస్తవాలే; అయినా అందరూ వాటిని హాయిగా మరిచిపోయి జేవిస్తున్నాం. అద్భుతంగా రాశావు తమ్ముడు !!!

    ఏడుస్తూ వస్తాం
    ఏడిపిస్తూ పోతాం
    .
    .
    నీడ కూడా మిగలకుండా
    తోడేదీ లేకుండా

    జవాబు
  • 7. madhavaraopabbaraju  |  7:30 సాయంత్రము వద్ద ఏప్రియల్ 10, 2011

    శ్రీ మురళీధర్ గారికి, నమస్కారములు.

    కవిత అతి సున్నితంగా వున్నది. బాగుంది. మరి మీ ప్రశ్నకు సమాధానం చెప్పమంటారా? శూన్యమనే విశ్వం నుంచి వచ్చి, తిరిగి అది విశ్వంలోకి వెళ్తుంటాము. శూన్యం/విశ్వం : దీనిని ఒక సున్నగా చూస్తే, సున్నాలోంచి, సున్నాను తీసివేస్తే, సున్నాయే మిగులుతుంది. అంటే, పోయింది లేదు, వచ్చిందీ లేదు. జీవులుకూడా అంతే.!

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    జవాబు
  • 8. sushma  |  2:02 సాయంత్రము వద్ద అక్టోబర్ 20, 2011

    chala baga rasarandi..
    nenu naku nachinavi, tochinavi rastuntanu..
    http://naahrudayaspandana-sushma.blogspot.com/

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

  • 41,718 దాటాను.

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape

Follow

Get every new post delivered to your Inbox.