ఏమయ్యింది నాకు?
ఫిబ్రవరి 15, 2009
ప్రపంచమంతా వేలంటైన్స్ డే పరిమళాల మత్తులో మునుగుతుంటే
నేను మాత్రం ఆటోలో నా బుర్రలోని ఆలోచనల్లా…
అద్దాలషాపుల్లో గులాబీలు అందంగా అమర్చిఉన్నాయి
బ్లడ్‍బ్యాంకులో నెత్తురు సీసాల్లా…
సెల్‍ఫోన్ తరంగాల్లో ప్రేమసందేశాలు
పంజాగుట్టలో ట్రాఫిక్‍లా….
గ్రీటింగ్‍కార్డుల్లో కవితలు అతికించి ఉన్నాయి….
జనాల పెదవులపై నవ్వుల్లా…
నెక్లస్‍రోడ్డ్లులో జంటల కిలకిలలు
అక్వేరియంలో రంగుల చేపల్లా…..
ఆలోచనలు సాగుతునే ఉన్నాయి
ఆటోమాత్రం ఆగింది మా ఇంటిముందు….
Entry Filed under: కవిత, తెలుగు. ట్యాగులు: కవిత, తెలుగు, kavita, telugu.
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed










1. padmarpita | ఫిబ్రవరి 15, 2009 at 1:14 అపరాహ్నం
బాగుంది మీరు పోల్చిన తీరు….
2. aswinisri | ఫిబ్రవరి 15, 2009 at 2:00 అపరాహ్నం
good.
3. parimalam | ఫిబ్రవరి 15, 2009 at 4:57 అపరాహ్నం
బ్లడ్‍బ్యాంకులో నెత్తురు సీసాల్లా… బావుందండీ !
4. bollojubaba | ఫిబ్రవరి 15, 2009 at 6:39 అపరాహ్నం
the similies are very good.
the expression is excellent
5. narasimha rao mallina | ఫిబ్రవరి 15, 2009 at 11:38 అపరాహ్నం
బాగున్నాయండి మీ పోలికలు.
6. Dhanu | ఫిబ్రవరి 18, 2009 at 8:04 పూర్వాహ్నం
ఇలంటివి చాల బాగా రస్తారంది !
7. ఉష | ఫిబ్రవరి 19, 2009 at 11:53 పూర్వాహ్నం
హ హ హ్హా. ఒకసారి Hyderabad అంతా తిప్పి వదిలారు.
నాకు మాత్రం మీకేమీఅవలేదనేవుంది.
ఆ తెచ్చిపెట్టుకున్న నైజాలు వద్దని, సహజమైన భావనకి అవేవీ వద్దనీ,
అలా ఆటోలో ఇంటికిచేరారని, అందులో ఆశాభంగం లేదనీ,
ప్రేమ మదికీ మదికీ నడుమ వారధేననీ, హృదిలోని చిత్రమే కాని,
కలంతో గీసే రాతకోతల్లో లేదని, పూలతో తెలిపేది కాదనీ తెలుసుకున్నారనివుంది.