తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం

జులై 26, 2008 at 12:51 సాయంత్రము 8 వ్యాఖ్యలు

మన తెలుగుబ్లాగర్లందరి తో నా ఆలోచన పంచుకోవాలని ఈ టపా పెడుతున్నాను. నా ఆలోచన వెనక రెండు విషయాలు ఉన్నాయి.
1.ఈ మధ్య కొందరు బ్లాగర్లు కనుమరుగవుతున్న తెలుగు భాష గురించి ఆవేదనగా టపాలు వ్రాసారు. అందరం కూడా చదివి నిజమే కదా అనుకున్నాం.
2.ఇక్కడ బ్లాగులలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి హిపోక్రసీ కి దూరం గా వ్రాయగలిగే ప్రతి ఒక్కరిని రచయితలుగా, విశ్లేషణాత్మక వ్యాఖ్యలు వ్రాసే మిత్రులను విమర్శకులు గా గుర్తిస్తున్నాం.
ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే మన ప్రపంచం లో మన ఆవేదన,ఆక్రోశం మనలోనే ఉండిపోతుంది తప్ప మన ఆంధ్రరాష్ట్రం లో మిగిలిన వారికి చేరటం లేదు.మనలో మనమే భాధపడటం అలానే మనలో మనమే ఓదార్చుకోవటం వలన ఏమిజరగదు.
కానీ మనం ఏమి చేయగలం?
మనం పూర్తిగా ప్రజల్ని మార్చ లేకపోవచ్చు. కానీ ఒక ముందడుగు వేసితెలుగు భాష మీద కాస్త గౌరవాన్ని పెంచగలమని నా భావన. పెద్ద పనులేమీ చేయనక్కరలేదు. పెను చీకటి ని పారద్రోలటానికి ఒక చిన్న దీపం చాలు. అలానే మనమున్న చీకటిని పోగొట్టటానికి ప్రతీ మనసులో ని చిన్న సంకల్పం చాలు.
మన బ్లాగు లోకం తరపున “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” గా ఒకరోజుని గుర్తించి ఆ రోజున తెలుగు వారి గౌరవాన్ని పెంచే చిన్న పనులు చేయవచ్చు. అవి ఎలాంటివి అనేది బ్లాగులోకం లో పెద్దలు నిర్ణయిస్తే బ్లాగు లోకం లో రచయితలుగా, విమర్శకులు గా ఉన్న పిన్నలూ,పెద్దలూ భుజానికెత్తుకోవడమే. విస్తృతంగా వ్యాపించిన మీడియా(టి.వి.9,ఎఫ్.ఎం., వార్తాపత్రికలు)  సహాయం తీసుకొని ప్రజల లోకి తీసుకుపోవచ్చు. బత్తిబంద్ కి ఇచ్చినట్టే దీనికి కూడా పిలుపునివ్వవచ్చు.
నా చిన్ని మెదడు కి తట్టిన ఆలోచన.
ఆ రోజు ఒక బ్యాడ్జి ధరించవచ్చు “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని. ఇలాంటి చిన్న చిన్న పనులను ఒక ఉద్యమంలా తీసుకొని ఆ రోజున మనం చేసి పదిమంది చేత చేయించవచ్చు. ఇది తెలుగు బ్లాగుప్రపంచం తెలుగుభాషకి చేసే చిన్న సేవ.
ఇది ఆచరణయోగ్యం కాదు, ఆమోదం కాదు అంటే వదిలి పెట్టండి.
జై తెలుగు తల్లి.

Entry filed under: Uncategorized. Tags: .

నేను పాటలు రాసానోచ్… మీ అబ్బాయి చాలా మంచోడు

అభిప్రాయములు Add your own

  • 1. Purnima  |  5:51 సాయంత్రము వద్ద జులై 26, 2008

    బానే ఉంది ఆలోచన!! ఆలోచించాలి దీని గురించి!!

    జవాబు
  • 2. సుధాకర బాబు  |  5:47 ఏ ఎమ్ వద్ద జులై 27, 2008

    మంచి సంకల్పం. ప్రస్తుతం బ్లాగులకున్న పరిమితమైన పరిధి వల్ల ఆచరణకు కాస్త సమయం పట్టవచ్చు. కాని అసాధ్యం కాదు. విజయోస్తు.

    జవాబు
  • 3. కె.మహేష్ కుమార్  |  8:04 ఏ ఎమ్ వద్ద జులై 27, 2008

    మంచి ఆలోచన.

    జవాబు
  • 4. చదువరి  |  12:59 సాయంత్రము వద్ద జులై 27, 2008

    మంచి ఆలోచన! ఇప్పటికే భాషా పరిరక్షణ సమితి వాళ్ళు ఒక పరిరక్షణ దినం జరుపుతున్నట్టున్నారు. మనం ఆరోజే జరపొచ్చు.., లేదా మరో రోజునైనా జరపొచ్చు.

    జవాబు
  • 5. కామేశ్వరరావు  |  1:43 సాయంత్రము వద్ద జులై 27, 2008

    ఆలోచన బావుందండి. ముఖ్యంగా ఇది అందరిలో తెలుగుభాషమీద అభిమానం, అవగాహనా రెండూ కలిగించేట్టు ఉంటే బావుంటుంది.
    దీన్ని ఎలా చెయ్యాలన్నదానిగురించి నలుగురూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాటి ఆశయంతోనే నేను తెలుగువీరలేవరా (teluguviralevara.blogspot.com) బ్లాగు మొదలుపెట్టాను. మీకు అభ్యంతరం లేకపోతే, ఈ చర్చని అక్కడ మొదలుపెట్టవచ్చు.

    జవాబు
  • 6. JayaPrakash Telangana  |  3:54 సాయంత్రము వద్ద జులై 27, 2008

    ఆలోచన మంచిదే అందరు అన్నట్టు,
    కని ఆగస్ట్ 15 తర్వాత మనం (ప్రజలు) మల్ల దేశం గురించో / స్వతంత్రం కు ఉన్న విలువ గురించో అలోచించం, ఇదిగూడ అట్లనే అయ్యే ప్రమాదం ఉన్నది.

    కాక పోతె మన అలోచనలను, మనకు ఉన్న పరిచయాలతోటి మనకు ఉన్న ప్రచార మాధ్యమాల (TV /Electronic / Print media) ద్వార మిగిలిన ప్రజల దగ్గరికి తీసుక పోవాలి. అప్పుడు ఎక్కువ మందికి అవగాహన పెరుగుతదని నా ఆలోచన.
    (This is just a personal thought, please add to it)

    జవాబు
  • 7. బ్లాగుదినోత్సవం « మురళీ గానం  |  5:30 ఏ ఎమ్ వద్ద ఆగష్టు 21, 2008

    [...] తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం అనే టపా మితృలు గుర్తించినట్టు లేరు. ఆంధ్రదేశం లో బ్లాగు అంటే ఏంటో తెలియని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు (నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి). తెలుగు బ్లాగులకి ఆంగ్లబ్లాగులంత విశేష ఆదరణ కావాలని మనం భావిస్తే జనాలకి అవగాహన కలిగే లా ఏదన్నా కార్యక్రమం చేయాలి. మనం రాష్ట్రం లో ఉన్న కాలేజి విధ్యార్ధులకి కూడా అవగాహన కలిగే లా చెయ్యగలిగితే ఇది మరో ఉద్యమమే అవుతుంది. దీనికి కాస్త సామాజిక భాద్యతని జోడించ గలిగితే మన భాష ని ఉద్దరించిన వాళ్ళం కాకపోయినా ఉడతా భక్తి ఏదో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇది మనకి మనమే చేసుకునే గొప్పసేవ ఆలోచించి వ్యాఖ్యానిస్తారని ఆశిస్తూ. [...]

    జవాబు
  • 8. కామేశ్వర రావు  |  6:25 సాయంత్రము వద్ద సెప్టెంబరు 23, 2008

    మురళిగారు,
    ఇదే ఆశయంతో ఒక గూగులు గుంపుని మొదలుపెట్టాను.
    దాని గురించి ఇక్కడ వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్! చూడవచ్చు.
    ఆసక్తి ఉంటే అందులో చేరి మీ ఆలోచనలు పంచుకోండి.

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

  • 41,718 దాటాను.

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape

Follow

Get every new post delivered to your Inbox.