చిరు ఆశ

జూన్ 6, 2008

“చిరు”ఆశ అంటే కొన్ని కోట్ల అభిమానుల ఆశ.
 
ఎవరో వస్తారని ఏదొ చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ఆంధ్ర ప్రజలకు చిరు రాజకీయ రంగ ప్రవేశం నిజంగా ఓ అల్లాదిన్ అద్బుత దీపమే. ఈ చిరు ఆశ వెనుక ఎన్నో మెగా ఆశలు ఉన్నాయి. మన అంజనీ పుత్రుడు సినిమాల్లొ హిమాలయాల నుండి సంజీవని, ఆకాశం నుండి గంగని తెచ్చాడు. అలాగే ఈ జగదేక వీరుడు మనకి ఎదో తెస్తాడని ప్రజల ఆశ. ముఠామేస్త్రి గా ఉన్నప్పుడే ప్రజలకి అవసరమైతే వస్తా అని చూచాయ గా చెప్పిన చిరు ఇంద్ర, ఠాగోర్, స్టాలిన్ ల తో ప్లాట్ ఫార్మ్ ఖాయం చేసాడు.ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులలో అందరూ దోచుకొనే వారే తరాల కొద్ది దాచు కొనే వారే.అత్త సొమ్ము అల్లుడి దానం అని ప్రజల సొమ్ము బంధువులకి బామ్మరుదులకి ధార పోసే వారే. పనికి ఆహారం తో మొత్తం కైంకర్యం చేసారని రాజన్న అంటే, జలయగ్నం ధన యగ్నమని చంద్రన్న అంటాడు.మొత్తానికి లెక్కల మాస్టారి మొట్టికాయల తర్వాత తెలుగు మాస్టారి లెంపకయల్లా వుంది అంధ్ర పరిస్థితి. ఇప్పుడు క్లీన్ కాండక్ట్  సర్టిఫికేట్ తో ఛిరు వస్తా అంటే మేము వద్దంటామా ? అని ప్రజలు       
‘శంకర్ దాదా జిందాబాద్ హూ హా హూ హా’ అంటూ జేజేలు కొడతారు. ఇన్నేళ్ళు గా తమ వోట్లన్ని నోట్లకి, క్వార్టర్లకి వేసిన జనం ఈ మొగల్తూర్ మగ మహారాజు కి వేసి నీరాజనాలు పలుకుతారు.                             

Entry Filed under: Mega Star. ట్యాగులు: .

7 Comments Add your own

  • 1. అబ్రకదబ్ర  |  జూన్ 7, 2008 at 11:33 అపరాహ్నం

    మరీ వీరాభిమాని రాతలాగుందిది. ఈ స్థాయిలో బాకా అవసరమా మురళిగారూ?

    జవాబు
  • 2. muralidharnamala  |  జూన్ 9, 2008 at 4:05 పూర్వాహ్నం

    నిజానికి నేను అభిమాని ని కాను. బ్లాగు మొదలు పెట్టెప్పుదు మంచి టాపిక్ కావాలి గా. ఈ రోజున మన రాష్ట్రం లో ఇంతకంటే పెద్ద టాపిక్ ఏముంది?

    జవాబు
  • 3. అబ్రకదబ్ర  |  జూన్ 9, 2008 at 6:20 అపరాహ్నం

    టాపిక్ బాగాలేదని కాదు; రాసిన పద్ధతి కాస్త అతిశయంగా ఉందని నా ఉద్దేశ్యం.

    జవాబు
  • 4. santhosh  |  జూన్ 10, 2008 at 6:27 అపరాహ్నం

    Hai man….this is too good to be true….content is not that impressive, but commendable …Please bring about some major changes, ie,. invoke some burning topics ….

    Is the post of governor is mandatory or not?

    Should the Govt. of India allow the Indian cricket team to travel Pakistan?

    What could be the role of IAS and IPS, the age-old machinery of Federal Govt. in these pro-govt. days?

    If at all glamour makes entry into politics what should be the agenda?

    etc,. etc,. questions and you can evoke the Indians response…..

    జవాబు
  • 5. Hari  |  జూన్ 14, 2008 at 8:14 పూర్వాహ్నం

    how can you surely say that chiru will not become a Rajjana or like a Chandranna….
    is there any idle person in politics who will be as white as forever…..
    Chiru MIGHT BE good today, but once entered into politics, how far it can be believable that he will do miracles to AP???? What is the evidence that he will serve AP to the extent that all people will be beneficiated??

    It is not the politics what he did so far in Cinema Industry suppressing mana stars and actors

    జవాబు
  • 6. kiran  |  జూన్ 16, 2008 at 10:43 పూర్వాహ్నం

    innallu anni party la ki chance lu istune vunnamu ,ipudu inkoka party ki chance iste poyedemi ledu oka vote tappa

    జవాబు
  • 7. బాబ్స్  |  అక్టోబర్ 1, 2008 at 2:11 అపరాహ్నం

    తనదాకా వస్తే గాని తెలీదనే దాన్ని రుజువు చేసి
    తొమ్మిది నెలల అభ్యాసంతోనూ ఎందుకొస్తున్నాను అని దస్త్రం చూడక విడమరచలేక
    పురిటి నొప్పులలోనే బంధుగణ సమర్థనతో
    సమస్యలపై తప్పటడుగులతో నడుస్తున్న నాయకుడిని
    అందరివాడని ఆంద్రులంతా ఆదరిస్తారా..?
    ఒక చిరు సినీ అభిమానిగా నాకు సందెహమే.

    జవాబు

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


మెటా

ఖజానాలు

ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

ఉత్తమ టపాలు

ఇటీవలి అభిప్రాయములు

kangaaroo on కాకి దిద్దిన కాఫురం (!?!)
K.Rao on ఆమె,నేను,కొన్ని ఊహలు..
M. Nagarjuna on ఆమె,నేను,కొన్ని ఊహలు..
Toon India on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…
pavan on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…

లింకులు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape